Begin typing your search above and press return to search.

పవన్ ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ అంటున్న బాలీవుడ్ స్టార్!

By:  Tupaki Desk   |   18 Dec 2020 2:41 PM IST
పవన్ ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ అంటున్న బాలీవుడ్ స్టార్!
X
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి, ప్రేక్షకులకు ఆయన మీదున్న అభిమానం గురించి అందరికీ తెలిసిందే. సినిమా సక్సెస్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా పెరుగుతూ వచ్చింది ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్. ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. పవన్ కు ఆ స్థాయి విజయం దక్కడానికి అక్షరాలా పదేళ్లు పట్టింది. అయినప్పటికీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ లో వన్ పర్సెంట్ కూడా తేడా రాలేదు. అదీ.. అభిమానుల్లో పవన్ క్రేజ్. పవన్ స్టామినాను పలువురు నటులు బహిరంగంగానే కొనియాడుతుంటారు. తాజాగా.. ఇదే రీతిలో స్పందించాడు బాలీవుడ్ స్టార్ బోమన్ ఇరానీ.

ఆ అభిమానానికి ఆశ్చర్యపోయా..
పవన్ కల్యాణ్ పై అభిమానులు చూపించిన ప్రేమకు తాను ఆశ్చర్యపోయానని బోమన్ ఇరానీ అన్నారు. వీరిద్దరూ కలిసి ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో అభిమానులు పవన్‌ ను ఉత్సాహ పరిచిన తీరు చూసి నేను ఆశ్చర్యపోయానన్నాడు బోమన్.

పవన్ మాత్రం మృదుస్వభావి అన్న బోమన్ ఇరానీ.. పరిపూర్ణమైన జెంటిల్ మెన్ అని కొనియాడారు. సెట్లో తాను దగ్గర్నుంచి చూశానని, పవన్ అందరిపట్లా గౌరవభావంతో ఉంటారని అన్నాడు. అయితే.. ‘అత్తారింటికి దారేది’లో పవన్‌తో సీన్స్ ఎక్కువగా లేవన్న బోమన్ ఇరానీ.. ‘అజ్ఞాత వాసి’లో మరికొన్ని సీన్లలో కలిసి నటించానని గుర్తు చేసుకున్నారు.