Begin typing your search above and press return to search.

టాలీవుడ్ డెబ్యూకు సిద్ధమైన బాలీవుడ్ యంగ్ హీరోయిన్!

By:  Tupaki Desk   |   6 April 2021 5:12 PM IST
టాలీవుడ్ డెబ్యూకు సిద్ధమైన బాలీవుడ్ యంగ్ హీరోయిన్!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మరో బాలీవుడ్ సెన్సేషన్ మితిలా పాల్కర్ అడుగుపెట్టనుంది. తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా 'ఓ మై కడవులే' తెలుగు రీమేక్ తో మితిలా డెబ్యూ చేయనుంది. టాలీవుడ్ యువహీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా.. ఇటీవలే మితిలా షూటింగ్ లో పాల్గొంది. 2018లో కర్వాన్ సినిమాతో లీడ్ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముంబై కుర్రది.. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన త్రిభంగా అనే సినిమాలో మెరిసింది. అయితే రొమాంటిక్ కామెడీ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో మితిలా.. తమిళంలో రితికాసింగ్ పోషించిన పాత్రలో కనిపించనుంది. తమిళ ఒరిజినల్ 'ఓ మై కడవులే' డైరెక్టర్ అశ్విన్ మరిముత్తు తెలుగు రీమేక్ కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమాలు ఇంకా టైటిల్ కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతం మితిలా పాల్కర్ అంటే దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఎందుకంటే ఆమె నటించిన నెట్ ఫ్లిక్స్ సిరీస్ 'లిటిల్ థింగ్స్' విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. త్వరలోనే లిటిల్ థింగ్స్ నాలుగో సీజన్ కూడా విడుదల కాబోతుంది. ఈ మధ్య తెలుగులో రీమేక్ సినిమాలు బాగానే రూపొందుతున్నాయి. ఇప్పుడు 'ఓ మై కడవులే' మూవీతో తెలుగులో మరో మంచి కథను అందించనున్నారు. అయితే ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాటలు రాస్తున్నాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ అండ్ పీవీపీ సినిమా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చూడాలి ఈ బాలీవుడ్ సుందరికి ఎలాంటి డెబ్యూ లభిస్తుందో!