Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న బాలీవుడ్ వాతి..!

By:  Tupaki Desk   |   20 April 2021 8:30 AM GMT
వైరల్ అవుతున్న బాలీవుడ్ వాతి..!
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్ ఫాలో అయ్యే సెలబ్రిటీలలో ఒకరు. తాజాగా దీపికా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ న్యూ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె ముంబై నగర వీధుల్లో స్టైల్ గా నడుస్తుంటే బాక్గ్రౌండ్ లో మాస్టర్ సినిమా 'వాతి కమింగ్' సాంగ్ వినిపించడం ఆశ్చర్యంగా ఉంది. చూస్తుంటే దీపికా వాతి కమింగ్ పాటకు వీరాభిమానిలా అనిపిస్తుంది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమా సాంగ్ ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ రీల్స్ లో కూడా వినిపిస్తుందంటే ఆ పాటకు ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది. దాదాపు గతేడాది నుండి వాతి కమింగ్ సాంగ్ సౌత్ లో ఓ ఊపు ఊపేసింది.

అయితే దీపికా షేర్ చేసిన వీడియోలో ఆమె నడుస్తూ మోంటేజ్ లుక్కులో కనిపించడం ఆకట్టుకుంటుంది. బీటిఎస్ ఆఫ్ బీటిఎస్ అనే కాప్షన్ జోడించి దీపిక పోస్ట్ చేసింది. ఈ వీడియో చూస్తూ దీపికా అభిమానులు అటు దళపతి అభిమానులు ఉత్సాహంగా వారి అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో దీపికా చాలా యాక్టీవ్. ఎప్పటికప్పుడు తన గురించి, సినిమాల గురించి ప్రేక్షకులతో షేర్ చేసుకుంటుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అమ్మడు చాలా సినిమాలను ఓకే చేసింది. భర్త రన్వీర్ సింగ్ తో 83లో నటిస్తూనే.. శకున్ బాత్రాతో ఓ సినిమా, సిద్ధార్థ్ ఆనంద్ తో ఫైటర్, అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ మూవీ చేయనుంది. అలాగే అమ్మడు నిర్మాతగా హాలీవుడ్ 'ది ఇంటర్న్' మూవీ రీమేక్ చేస్తోంది.