Begin typing your search above and press return to search.

యంగ్ టైగర్-బాలీవుడ్ ట్రైనర్

By:  Tupaki Desk   |   31 Dec 2017 9:17 AM GMT
యంగ్ టైగర్-బాలీవుడ్ ట్రైనర్
X
జై లవకుశ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేసాక ఫ్యామిలీ వెకేషన్ తో రిలాక్స్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ కోసం అన్నిరకాలుగా రెడి అవుతున్నాడు. ఆ మూవీ జానర్ గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ అది బయటికి రాకుండా యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అజ్ఞాతవాసి విడుదల కాగానే కొద్ది రోజులు ప్రమోషన్ లో పాల్గొని ఆపై తారక్ మూవీతో బిజీ అవుతాడు త్రివిక్రమ్. ఇక దీని కోసం ఫిజిక్ మేకోవర్ కూడా చేసుకుంటున్నాడు తారక్. ఎక్కువ జాప్యం లేకుండా వీలైనంత త్వరగానే షూటింగ్ పూర్తి చేసేలా ప్లానింగ్ లో ఉన్నాడు త్రివిక్రమ్. దీని తర్వాత వెంకటేష్ తో సినిమా చేయాల్సి ఉంది ప్లస్ ఎన్టీఆర్ కూడా రాజమౌళి మల్టీ స్టారర్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అందుకే దసరా రిలీజ్ టార్గెట్ గా పెట్టుకున్నారు.

బాలీవుడ్ హీరో రన్వీర్ కపూర్ పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ రంగంలోకి దిగాడు. ఎన్టీఆర్ తో తాను తీసుకున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఇద్దరు కలిసి పని చేయబోతున్న విషయాన్నీ బయట పెట్టేసాడు. రన్వీర్ కపూర్ ఫిట్నెస్ లో స్టీవెన్స్ పాత్ర చాలా ఉంది. ఇది చూసి యంగ్ టైగర్ ఫాన్స్ ఫుల్ ఖుషిగా ఫీల్ అవుతున్నారు. జై లవకుశలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అవలీలగా పోషించి తాతకు తగ్గ మనవడు అనిపించుకున్న తారక్ ఇప్పుడు స్టీవెన్స్ సహాయంతో మరో కొత్త షేడ్ బయటికి తీసుకువస్తాడు అని నమ్మకంతో ఉన్నారు. ఇందులో హీరొయిన్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. అను ఇమ్మానియేల్ వైపే త్రివిక్రమ్ మొగ్గు చూపుతున్నట్టు టాక్ ఉంది. మ్యూజిక్ మాత్రం అనిరుద్ కాకుండా వేరే ఆప్షన్ చూస్తున్నట్టు తెలిసింది.