Begin typing your search above and press return to search.

పుష్ప 2 కు బాలీవుడ్‌ టచ్‌.. ట్విస్ట్‌ అదుర్స్‌

By:  Tupaki Desk   |   26 April 2022 2:30 AM GMT
పుష్ప 2 కు బాలీవుడ్‌ టచ్‌.. ట్విస్ట్‌ అదుర్స్‌
X
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రమోషన్‌ లేకుండా హిందీ లో విడుదల అయిన పుష్ప సినిమా వంద కోట్ల వసూళ్లను దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రమోషన్ లేకుండా విడుదల అయితేనే వంద కోట్లు సాధించిన పుష్ప ఫుల్‌ స్వింగ్ ప్రమోషన్స్ తో విడుదల అయితే మరింత భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది.

పుష్ప 2 ను హిందీ ప్రేక్షకులను టార్గెట్‌ చేసి రూపొందించాలని అంతా భావిస్తున్నారు. పుష్ప 2 సినిమాకు పుష్ప 1 సినిమా విడుదల సమయంలోనే స్క్రిప్ట్‌ రెడీ అయ్యింది. కాని బాలీవుడ్‌ లో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతోనే స్క్రిప్ట్‌ విషయంలో మార్పులు చేర్పులు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో నిజం ఎంతో కాని నటీ నటుల ఎంపిక విషయం లో బాలీవుడ్‌ ప్రేక్షకుల ను దృష్టిలో పెట్టుకోవాలని సుకుమార్‌ భావిస్తున్నాడు.

సుకుమార్‌ ఈ సినిమా కోసం బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సునీల్‌ శెట్టిని ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం క్లైమాక్స్ ట్విస్ట్‌ లో సునీల్‌ శెట్టి ఉంటాడట. సినిమాకు ఆ ట్విస్ట్‌ హైలైట్‌ గా ఉంటుందనే నమ్మకం ను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలో హీరోయిన్‌ గా రష్మిక మందన్నా నటించబోతుండగా ఐటెం సాంగ్ ను బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ ను నటింపజేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో ఇంకా కొందరు బాలీవుడ్‌ కు చెందిన వారు నటించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు సునీల్‌ శెట్టిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే తెలుగు లో సునీల్‌ శెట్టి నటించాడు.. ఇంకా నటిస్తూనే ఉన్నాడు. కనుక పుష్ప 2 సినిమా లో ఆయన నటిస్తాడనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. సునీల్‌ శెట్టి నటించడం వల్ల బాలీవుడ్‌ లో తప్పకుండా మరింత క్రేజ్ రావడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సునీల్‌ శెట్టి పుష్ప 2 సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.