Begin typing your search above and press return to search.

ట్రాన్స్ పోర్ట‌ర్ కోసం త‌న్నుకుంటోన్న స్టార్స్!

By:  Tupaki Desk   |   28 Dec 2022 6:40 AM GMT
ట్రాన్స్ పోర్ట‌ర్ కోసం త‌న్నుకుంటోన్న స్టార్స్!
X
హాలీవుడ్ లో 2002 లో రిలీజ్ అయిన ప్రెంచ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'ది ట్రాన్స్ పోర్ట‌ర్' వ‌ర‌ల్డ్ వైడ్ ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేసిందో తెలిసిందే. అప్ప‌టి హాలీవుడ్ యాక్ష‌న్ చిత్రాల్లో న్యూ ట్రెండ్ ని క్రియేట్ చేసిన చిత్ర‌మిది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. యాక్ష‌న్ స్టార్ జాస‌న్ స్టాత‌మ్ విన్యాసాల‌కు ఒళ్లు గ‌గుర్లు పొడుస్తుంది. యాక్ష‌న్ స్టార్ అంటే ఇలా ఉండాలి? అని ఓ న్యూ వేవ్ ని క్రియేట్ చేసాడు.

తాజాగా ఇప్పుడీ చిత్రాన్ని బాలీవుడ్ లోనూ రీమేక్ చేస్తున్నారు. విశాల్ ఠాణా హిందీ రైట్స్ ద‌క్కించుకున్నారు. అయితే ఈ సినిమా ఆ యాక్ష‌న్ హీరో రోల్ కోసం ముగ్గురు బాలీవుడ్ హీరోల మ‌ధ్య ప్ర‌ధాన పోటీ క‌నిపిస్తుంది. హృతిక్ రోష‌న్..టైగ‌ర్ ష్రాప్..ర‌ణ‌వీర్ సింగ్ ముగ్గురు ఈ చిత్రంలోన‌టించాల‌ని ఆస‌క్తి చూపిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఎవ‌రికి వారు సొంత ప్ర‌య‌త్నాలు వ్య‌క్తిగ‌తంగా మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం. స్టోరీ స‌హా అందులో హీరో పాత్ర హైలైట్ అవుతుండ‌టంతో ముగ్గురు స్టార్లు పోటీ ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ముగ్గ‌రు ఆ పాత్ర‌కి స‌రితూగే వారే. ఎవ‌ర్నీ త‌క్కువ చేయ‌డానికి లేదు. ఒకరి కొక‌రుపోటీ ప‌డి న‌టించ‌గ‌ల స‌మ‌ర్ధులు. హృతిక్..టైగ‌ర్ అయితే యాక్ష‌న్ చిత్రాల‌కు పెట్టింది పేరుగా బాలీవుడ్ లో దూసుకుపోతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ స‌న్నివేశాన్ని ఉద్దేశించి విశాల్ ఠానా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. 'యాక్ష‌న్ చిత్రాలంటే చాలా ఇష్టం అందుకే ఈసినిమా రైట్స్ తీసుకున్నా. భారీ బడ్జెట్ తో చిత్రాన్ని రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ఇప్ప‌టికే ఈ త‌ర‌హా క‌థులు చాలానే విన్నాం. వాటిలో కొన్నికొత్త‌గానూ అనిపించాయి. ఏది డిసైడ్ అవుతుందో తెలియ‌దు. కానీ రీమేక్ మాత్రం ప‌ట్టాలెక్కుతుంది. అలాగే ఇందులో హీరోగా హృతిక్...ర‌ణ‌వీర్...టైగ‌ర్ లో ఎవ‌రో ఒక‌రు ఉండొచ్చ‌ని ' తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.