Begin typing your search above and press return to search.

'స్పార్క్' ఓటీటీకి బాలీవుడ్ సపోర్ట్..!

By:  Tupaki Desk   |   13 May 2021 4:00 PM IST
స్పార్క్ ఓటీటీకి బాలీవుడ్ సపోర్ట్..!
X
కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కి ఆదరణ పెరగడంతో చాలామంది కొత్త ఓటీటీలు - ఏటీటీలు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీలకు పోటీగా ప్రాంతీయ ఓటీటీలు కూడా పుట్టుకొచ్చాయి. తాజాగా యువ పారిశ్రామికవేత్త సాగర్‌ మచనూరు 'స్పార్క్' (SPARK) అనే సరికొత్త ఓటీటీకి శ్రీకారం చుట్టారు.

'స్పార్క్' యూకే ఆధారిత ఇంక్రివెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లోని ఒక యూనిట్. ఇప్పుడు భారతీయ ఓటీటీ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. బ్రాండ్ న్యూ 'స్పార్క్' ఓటీటీని మే 15న సాగర్ మాచనూరు గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన దావూద్ ఇబ్రహీం రియల్ స్టోరీ 'D కంపెనీ' సినిమాతో ఈ ఓటీటీ ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో రాజమౌళి - ప్రభాస్ - పూరీ జగన్నాథ్ - ప్రకాష్ రాజ్ - సురేష్ బాబు - అడవి శేష్ - మంచు లక్ష్మి - బ్రహ్మానందం వంటి సినీ ప్రముఖులు 'స్పార్క్' ఓటీటీ సీఈఓ సాగర్ కు శుభాకాంక్ష‌లు తెలప‌డం విశేషం. ఇప్పుడు ఈ ఓటీటీకి బాలీవుడ్ నుంచి కూడా సపోర్ట్ లభిస్తోంది. స్టార్ హీరో రితేష్ దేశ్ ముఖ్ వీడియో బైట్ ద్వారా 'స్పార్క్' ఓటీటీ స్టార్ట్ చేస్తున్నందుకు నిర్వాహకులకు తన విషెస్ తెలియజేశారు.

ఇకపోతే 'స్పార్క్' ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలోని కంటెంట్‌ ను అందుబాటులో ఉంచనున్నారు. ఇందులో ఒరిజినల్ మూవీస్ - వెబ్ సిరీస్ లు - డ‌బ్బింగ్ సినిమాలతో పాటుగా కొత్త సినిమాలను డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేయనున్నారు. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అందించాలానే లక్ష్యంతో ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ని ఇవ్వడం గ్యారెంటీ అని ఓటీటీ నిర్వాహకులు తెలిపారు.