Begin typing your search above and press return to search.
బాలీవుడ్ సూపర్ స్టార్ కు తెలుగమ్మాయి కావాలట
By: Tupaki Desk | 4 Nov 2020 9:45 AM ISTబాలీవుడ్ లో ప్రస్తుతం నెం.1 హీరో అక్షయ్ కుమార్. ఈయన ఏడాదికి నాలుగు అయిదు సినిమాలను విడుదల చేస్తూ అత్యధిక సక్సెస్ రేటును కలిగి ఉండటంతో పాటు అత్యధిక సంపాదన కలిగి ఉన్న హీరోగా కూడా నిలిచాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి 'బచ్చన్ పాండే'. ఈ సినిమాకు పర్హద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అక్షయ్ సౌత్ ఇండియన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకోసం ఈ సినిమాలో సౌత్ అమ్మాయిని ఒక హీరోయిన్ గా నటింపజేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారట.
అక్షయ్ కుమార్ కు జోడీగా ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కృతి సనన్ ను ఎంపిక చేయడం జరిగింది. ఆమె కాకుండా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించాల్సింది. అది కూడా ఒక సౌత్ ఇండియన్ పాత్ర. ఆ కారణంగా సౌత్ అమ్మాయిని ముఖ్యంగా తెలుగు అమ్మాయిని ఆ పాత్రకు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సెకండ్ హీరోయిన్ పాత్ర అయినా కూడా అక్షయ్ మూవీలో హీరోయిన్ పాత్ర అంటే ఖచ్చితంగా అది బంపర్ ఆఫర్ అనడంలో సందేహం లేదు. ఆ బంపర్ ఆఫర్ ను ఏ తెలుగు అమ్మాయి దక్కించుకోబోతుందో చూడాలి.
తెలుగు నుండి సరైన అమ్మాయి లభించని పక్షంలో ఇతర సౌత్ భాషల హీరోయిన్ ను తీసుకునే అవకాశం ఉందట. మరి ఆ అవకాశంను తెలుగు అమ్మాయిలు దక్కంచుకుంటారా లేదా అనేది తెలియాలంటే జనవరి వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుండి ప్రారంభం కాబోతున్నట్లుగా ఇటీవలే దర్శకుడు మరియు ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది.