Begin typing your search above and press return to search.

'రాధేశ్యామ్' తో గొంతు కలిపిన సూపర్ స్టార్..!

By:  Tupaki Desk   |   22 Feb 2022 6:42 AM GMT
రాధేశ్యామ్ తో గొంతు కలిపిన సూపర్ స్టార్..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ''రాధేశ్యామ్''. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ పీరియాడికల్ లవ్ డ్రామా తెరకెక్కింది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. కరోనా పరిస్థితుల్లో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయింది. 2022 మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

'రాధే శ్యామ్' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ భాగం అవుతున్నారు. హిందీ వర్షన్ కు బిగ్ బీ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడిస్తూ.. ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు.

'రాధేశ్యామ్' వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు షెహెన్‌ షా అమితాబ్ బచ్చన్ గారికి ధన్యవాదాలు. ఎపిక్ లవ్ స్టోరీని మీ ఇన్క్రెడిబుల్ నేరేషన్ తో మరింత ఎపిక్ గా మార్చారు అని చిత్ర బృందం పేర్కొంది. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి అమితాబ్ ''ప్రాజెక్ట్ K'' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్ లో వీరిద్దరి కాంబినేషన్ లో సీన్స్ షూట్ చేస్తున్నారు.

ఇప్పుడు 'రాధే శ్యామ్' కు వాయిస్ ఓవర్ ఇవ్వడం ద్వారా అమితాబ్ 'ప్రాజెక్ట్ K' కంటే ముందే ప్రభాస్ సినిమాలో భాగం అవుతున్నట్లు అయింది. ఇంతకముందు అమితాబ్ బచ్చన్ తెలుగులో అక్కినేని ఫ్యామిలీ నటించిన 'మనం' సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో డార్లింగ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీతో బిగ్ బీ తెలుగు స్క్రీన్ మీద ఫుల్ లెన్త్ రోల్ లో కనిపించనున్నారు.

ఇకపోతే 'రాధే శ్యామ్' సినిమాని 1970ల కాలం నాటి యూరప్ బ్యాక్ డ్రాప్ లో వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తీర్చిదిద్దారు. ఇది ప్రభాస్ చాలా కాలం తర్వాత చేస్తున్న లవ్ స్టోరీ. అయినప్పటికీ ఇందులో అంతకుమించి ట్విస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ - వాలెంటైన్ స్పెషల్ గ్లిమ్స్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ప్రేమకు విధికి మధ్య యుద్ధాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

ఫేమస్ హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్య గా ప్రభాస్ నటించగా.. ప్రేరణగా పూజా హెగ్డే కనిపించనుంది. కృష్ణంరాజు - భాగ్యశ్రీ - జగపతిబాబు - ప్రియదర్శి - కునాల్ రాయ్ క‌పూర్‌ - స‌చిన్ ఖేడ్కర్‌ - ముర‌ళి శ‌ర్మ‌ - ఎయిర్ టెల్ శాషా ఛ‌త్రి - రిద్ది కుమార్‌ - స‌త్యన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ మరియు గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. వంశీ - ప్రమోద్ - ప్రసీద నిర్మాతలుగా వ్యవహరించారు. హిందీలో టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు.

నాలుగు దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నారు. హిందీ వెర్సన్ కు మిథున్ - మన్హాన్ - అమాల్ మాలిక్ మ్యూజిక్ అందించారు. మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ.. ఆర్‌.రవీందర్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్ నిర్వహించారు. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.