Begin typing your search above and press return to search.

ఒక్క పార్టీకి కూడా ఆమెను పిలువలేదుగా

By:  Tupaki Desk   |   20 Oct 2017 11:00 PM IST
ఒక్క పార్టీకి కూడా ఆమెను పిలువలేదుగా
X
బాలీవుడ్లో ఒక ట్రెండ్ ఉంది. రంజాన్ అయినా దీపావళి అయినా కూడా అక్కడ సెలబ్రిటీలు పార్టీలు ఇచ్చేస్తుంటారు. ఆ పార్టీలకూ పూజలకూ అసలు తనమన పర భేదాలు లేకుండా చాలామంది వస్తారు. అలాంటి పార్టీలకు ఆహ్వానం అందని నటీమణులు అయితే.. తమకు ఇంకా స్టార్డమ్ రాలేదని ఫీలైపోతుంటారు కూడా. ఇప్పుడు ఒక హీరోయిన్ విషయంలో అలాగే జరిగింది.

విషయం ఏంటంటే.. అమితాబ్ బచ్చన్ నుండి సల్మాన్ ఖాన్ వరకు.. షారూఖ్ నుండి అక్షయ్ కుమార్ వరకు.. ఇలా స్టార్ హీరోలందరూ పార్టీల్లో కనిపించారు. ఇక కొత్త కొత్త హీరోయిన్లు అయిన నిధి అగర్వాల్.. పూజా హెగ్డే మాత్రమే కాదు.. ఇంకా తెరపైకి తెరంగేట్రం చేయని శ్రీదేవి కూతుళ్లు జాన్వి అండ్ ఖుషీ కూడా కొన్ని పార్టీల్లో మెరిశారు. అయితే ఒక్క పార్టీలో కూడా మెరవని ఆ హీరోయిన్ ఎవరంటే.. ఇంకెవరు.. టాప్ స్టార్ అయిపోతున్న కంగనా రనౌత్. అసలు ఒక రేంజ్ స్టార్ అయిపోయింది కాబట్టి.. ఖచ్చితంగా ఈమె ఎక్కడైనా మెరుస్తుంది అనుకుంటే.. ఉదయాన్నే జిమ్ లో.. సాయంత్రం తన చెల్లిలో ఇంట్లో.. రాత్రి ఎప్పుడో ఎయిర్ పోర్టులో తప్పించి.. అసలు కంగన ఒక్కరి పార్టీలో కూడా కనిపించలేదు. దీని గురించి బాలీవుడ్ మరో రకంగా చెబుతోంది.

ఇప్పుడు కంగనను పార్టీకి పిలిస్తే.. హృతిక్ అండ్ కంగన మధ్యన జరుగుతున్న యవ్వారంలో అనసవరంగా ఆమెకు సపోర్టు ఇచ్చారు అనే రూమర్ ఆ పిలిచినవారిపై వచ్చేస్తుంది. అందుకే ఆమెను ఎవ్వరూ పిలవలేదుట. అది సంగతి. మరి కంగన ఇలాంటి పార్టీలను పూజలను అస్సలు పట్టించుకోదులే. ఆమె పని ఆమె చేసుకుపోతుంటుంది.