Begin typing your search above and press return to search.

పిల్లల సినిమా కోసం పెద్ద స్టార్స్‌ రంగంలోకి..!

By:  Tupaki Desk   |   21 Nov 2018 7:31 AM GMT
పిల్లల సినిమా కోసం పెద్ద స్టార్స్‌ రంగంలోకి..!
X
పిల్లలు మరియు పెద్దలు ఎంతో ఇష్టపడే ‘మోగ్లీ’ ను వెబ్‌ సిరీస్‌ గా తీసుకు వచ్చేందుకు నెట్‌ ఫ్లిక్స్‌ సిద్దం అయ్యింది. ‘మోగ్లీ : లెజెండ్‌ ఆఫ్‌ ది జంగిల్‌’ టైటిల్‌ తో తెరకెక్కుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ ను డిసెంబర్‌ 7 నుండి ఆన్‌ లైన్‌ లోకి తీసుకు రాబోతున్నారు. పలు భాషల్లో మోగ్లీని తీసుకు వచ్చేందుకు సిద్దమవుతున్న నెట్‌ ఫ్లిక్స్‌ హిందీలో సూపర్‌ స్టార్స్‌ తో డబ్బింగ్‌ చెప్పిస్తున్నారు. హిందీకి చెందిన ప్రముఖ స్టార్స్‌ ముఖ్యమైన పాత్రలకు డబ్బింగ్‌ చెబుతున్న కారణంగా మోగ్లీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

బాలీవుడ్‌ స్టార్స్‌ కరీనా కపూర్‌ ఖాన్‌ - అభిషేక్‌ బచ్చన్‌ - మాధురి దీక్షిత్‌ - అనీల్‌ కపూర్‌ - జాకీ ష్రాఫ్‌ వంటి వారు మోగ్లీలోని కీలక పాత్రలకు డబ్బింగ్‌ చెప్పబోతున్నారు. మోగ్లీ లోని కీలకమైన పాము కు కరీనా కపూర్‌ డబ్బింగ్‌ చెప్పబోతుండగా - నిషా పాత్రకు మాధురి దీక్షిత్‌ - భగీరా పాత్రకు అభిషేక్‌ బచ్చన్‌ - బాలో పాత్రకు అనీల్‌ కపూర్‌ లు చెప్పనున్నారు. ఇక మోగ్లీలో కీలకమైన షేర్‌ ఖాన్‌ పాత్రకు జాకీ ష్రాప్‌ డబ్‌ చెప్పబోతున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మోగ్లీకి బాలీవుడ్‌ స్టార్స్‌ డబ్బింగ్‌ ఖచ్చితంగా హైలైట్‌ గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వెబ్‌ సిరీస్‌ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.