Begin typing your search above and press return to search.

ట్వీటేస్తే కురుస్తుంది కాసుల వర్షం..

By:  Tupaki Desk   |   23 Sept 2015 10:03 AM IST
ట్వీటేస్తే కురుస్తుంది కాసుల వర్షం..
X
మార్కెటింగ్ రంగం కొత్త పుంతలు తోక్కాక ఏ వస్తువునైనా - ఏ సందర్భాన్నైనా - ఏ మాధ్యమాన్నైనా వాణిజ్యపరంగా ఆలోచించడం సాధారణమైపోయింది. ఈ క్రమంలో తారలు వారి అభిమానుల మధ్య స్వచ్చమైన వారధిలా నిలుస్తున్న ట్విట్టర్ ఛానల్ ని సైతం తమ ఉత్పత్తులకు ప్రకటనలందించే విధంగా ఆలోచించడం మెచ్చుకోదగ్గ అంశం.

మా హోటల్ లో భోజనం అద్భుతమంటూ ఎన్ని యాడ్లు వేసినా పట్టించుకోని ప్రజలు ఒక స్టార్ హీరో ఆ హోటల్ లో రుచి అమోఘం అని ట్వీట్ చెయ్యగానే అడ్రస్ వెతుక్కుని మరీ వెళ్తారు. అది సెలబ్రిటీల పదజాలానికి వున్న మాయాజాలం. ఈ వాసనని పసిగట్టిన సంస్థలు మా ఉత్పత్తులను ట్వీట్ చెయ్యండి మీ ఒక్కో ట్వీట్ కి కాసుల వర్షం కురిపిస్తామని వరాలిస్తున్నారు.

బాలీవుడ్ లో ఈ హవా ఇప్పటికే పాకిపోయింది. హై రేంజ్ సెలబ్రిటీల ట్వీట్లకు 10 నుండి 12 లక్షల రూపాయలను సమర్పిస్తుంటే కాస్త తక్కువ వర్గానికి 5 నుండి 6 లక్షలు ముట్టజెప్తున్నారు. త్వరలోనే ఈ సంస్కృతి టాలీవుడ్ కి సైతం పాకుతుంది అనడంలో వింత లేదు.