Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కోసం మరో బాలీవుడ్ స్టార్ ని ఫైన‌ల్ చేశారా?

By:  Tupaki Desk   |   29 Oct 2022 3:30 PM GMT
ప‌వ‌న్ కోసం మరో బాలీవుడ్ స్టార్ ని ఫైన‌ల్ చేశారా?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ ఫిల్మ్ 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. ప‌వ‌న్ కెరీర్ లో న‌టిస్తున్న తొలి పీరియాడిక్ ఫిల్మ్ కావ‌డంతో అభిమానులు ఈ మూవీపై భారీ అంచ‌య‌నాలు పెట్టుకున్నారు. అంతే కాకుండా ప‌వ‌న్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ఇదే కావ‌డంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. క్రిష్ జాగ‌ర్ల‌మూడి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని తెర కెక్కిస్తున్నారు.

17వ శతాబ్ద కాలం నాటి మొఘ‌ల్ సామ్రాజ్యం నేప‌థ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. సినిమాలో రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌నిపించ‌బోతున్నారు. అంతే కాకుండా కోహినూర్ వ‌జ్రం నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో ఈ మూవీ సాగుతుంద‌ని తెలుస్తోంది. మొఘ‌ల్ సామ్రాజ్యంలోని రోష‌నార‌గా బాలీవుడ్ న‌టి న‌ర్గీస్ ఫ‌క్రీ న‌టిస్తుండ‌గా ఔరంగ‌జేబ్ పాత్ర‌లో అర్జున్ రాంపాల్ న‌టిస్తాడ‌ని ప్ర‌క‌టించారు.

అయితే ఇప్ప‌డు ఆ పాత్ర కోసం మ‌రో బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్ ని తీసుకున్నార‌ని తెలుస్తోంది. కార‌ణం. ప‌వ‌న్ క‌ల్యాణ్ పొలిటిక‌ల్ టూర్ ల కార‌ణంగా గ‌త కొంత కాలంగా 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్ డిలే అవుతూ వ‌స్తోంది. దీంతో అర్జున్ రాంపాల్ డేట్స్ స‌మ‌స్య త‌లెత్తింద‌ట‌. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి అర్జున్ రాంపాల్ త‌ప్పుకున్నాడ‌ని తెలుస్తోంది. అత‌ని స్థానంలో ఔరంగ‌జేబ్ క్యారెక్ట‌ర్ కోసం బాబీ డియోల్ ని ఫైన‌ల్ చేసుకున్నార‌ట‌.

గ‌త కొంత కాలంగా షూటింగ్ ప‌వ‌న్ కార‌ణంగా డిలే అవుతున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ ఇటీవ‌లే రామోజీ ఫిల్మ్ సిటీలో మొద‌లైంది. అక్క‌డ ప‌వ‌న్ తో పాటు చిత్ర ప్ర‌ధాన తారాగ‌ణం పాల్గొన‌గా కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు.

అంతే కాకుండా ప‌వ‌న్‌, హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ పాల్గొన‌గా ప్ర‌స్తుతం ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ కోసం ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాటు చిత్ర బృందం వ‌ర్క్ షాప్ లో పాల్గొన్న విష‌యం తెలిసిందే.

వ‌ర్క్ షాప్ అనంత‌రం ప‌వ‌న్ తాజా షెడ్యూల్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించడంతో ప‌వ‌న్ అభిమానులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా వుంటే బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్ న‌వంబ‌ర్ నుంచి 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్ లో పాల్గొన‌బోతున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే బాబీ డియోల్ హైద‌రాబాద్ రానున్నాడ‌ని తెలిసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.