Begin typing your search above and press return to search.

#సుశాంత్.. ఆత్మ‌హ‌త్య వెన‌క మిస్ట‌రీ అదేనా?

By:  Tupaki Desk   |   15 Jun 2020 4:00 AM GMT
#సుశాంత్.. ఆత్మ‌హ‌త్య వెన‌క మిస్ట‌రీ అదేనా?
X
యువ‌క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అభిమానులనే గాక బాలీవుడ్ వ‌ర్గాల్ని తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురిచేసింది. బాలీవుడ్ లో అత‌డు కెరీర్‌లో గొప్పగా రాణిస్తున్న త‌రుణ‌మిది. కెరీర్ ప‌రంగా ఎలాంటి నిరాశ‌నిస్పృహ‌లు అత‌డికి లేవు. ఎల్ల‌లు లేకుండా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఎం.ఎస్.ధోనీగా న‌టించి తెలుగు రాష్ట్రాలు స‌హా అన్ని చోట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడంటే అత‌డి బ్రైట్ ఫ్యూచ‌ర్ ని ఊహించ‌వ‌చ్చు.

అయితే అత‌డి ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మేమిటి? అత‌డి ఇంట్లో ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని ఏదైనా నోట్ రాసాడా? అంటే దేనికీ ప్రూఫ్ దొర‌క‌లేదు. సుశాంత్ ఇంటి నుండి పోలీసులు ఆత్మహత్య నోట్ ను కనుగొనలేదు. అతను నివసిస్తున్న బాంద్రా నివాసంలో కొన్ని మెడిక‌ల్ ప్రిస్క్రిప్షన్లు.. మందులను కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ మందులు దేనికోసం అంటే.. నిరాశ‌నిస్పృహ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు చికిత్స జ‌రుగుతోంద‌ని పోలీస్ నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి.

సుశాంత్ సూసైడ్ స‌మ‌యంలో అత‌డి స్నేహితులు ఎక్క‌డ ఉన్నారు? అంటే.. అత‌డికి స‌మీపంలోనే ఉన్నారని తెలుస్తోంది. వారంతా ఏదో తప్పు జరిగిందని ఆదివారం ఉదయమే సందేహించారు. అందుకే నేరుగా సుశాంత్ ఇంటి గది తలుపు తట్టారు. అయితో లోప‌లినుంచి ఎలాంటి స్పందన రాలేదు. స్నేహితులు అతని గదిలోకి ప్రవేశించినప్పుడు పైకప్పు నుండి వేలాడుతున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామ‌ని చెబుతున్నారు. ఇలాంటి మ‌ర‌ణం ఊహించ‌నిది. విషాదాంతం స్నేహితులు ఎప్ప‌టికీ ఊహించ‌నిది.