Begin typing your search above and press return to search.

సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ కిడ్స్ వీళ్ళే..!

By:  Tupaki Desk   |   3 May 2020 2:30 AM GMT
సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ కిడ్స్ వీళ్ళే..!
X
సినీ ఇండస్ట్రీలో నట వారసులకు కొదవుండదు. ఒకరు కష్టపడి ఇండస్ట్రీకి పరిచయమయ్యారంటే వారి నుండి వరసపెట్టి నటీనటులు వస్తూనే ఉంటారు. ఇది మన ఒక్క టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకే పరిమితం కాలేదు. అన్ని ఇండస్ట్రీలలో తమ నటవారసులను ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నారు. ఇక బాలీవుడ్ విషయానికొస్తే కపూర్ ఫ్యామిలీ నుండి.. బచ్చన్ ఫ్యామిలీ నుండి.. ఖాన్ ఫ్యామిలీ నుంచి.. ఇలా అన్ని ఫ్యామిలీల నుంచి హీరోహీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వారిలో ఒకరిద్దరు తప్ప దాదాపు అందరూ తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. రణబీర్ కపూర్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, అభిషేక్ బచ్చన్, అలియా భట్, సోనాక్షీ సిన్హా, సోనమ్ కపూర్, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో మరికొందరు స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి రెడీగా ఉన్నారు. వారిలో కొందరు ఇప్పటికే క్రేజ్ లో వారి సెలబ్రిటీ పేరెంట్స్ ని మించిపోయారు. ఫ్యాన్ ఫాలోయింగ్ లో వారు అందుకోలేని స్థాయిలో ఉన్నారు. అలాంటి వారు తమ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ ఇండస్ట్రీలో డెబ్యూగా అడుగుపెట్టడానికి రెడీగా ఉన్నారు.

ఇప్పటికే ఈ ఏడాది పూజా బేడి కుమార్తె ఆలియా ఫర్నిచర్ వాలా 'జవానీ జానేమన్' చిత్రంతో బాలీవుడ్‌ లోకి అడుగుపెట్టింది. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ - టబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ కూతురిగా నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అలియా తో పాటు ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ఇప్పటికే ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసారు. సుహానా ఖాన్, ఖుషీ కపూర్, షానయ కపూర్.. ఇలా చాలా మంది స్టార్ కిడ్స్ త్వరలో వెండితెరపై కనిపించబోతున్నారు.

అహన్ శెట్టి : వీరిలో మొదటగా డెబ్యూ ఇవ్వబోతున్నాడు. సునీల్ శెట్టి కొడుకైన అహన్ 'మిలన్ లుథ్రియా తడాప్' అనే చిత్రంతో బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా మన తెలుగులో సూపర్ హిట్ అయిన 'Rx 100' సినిమాకి రీమేక్ గా రూపొందుతోంది. తారా సుతారియా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. ఈ సినిమా అక్కడ కూడా మంచి విజయం సాదిస్తుందని నమ్మకంగా ఉన్నారు.

షానయా కపూర్ : సంజయ్ కపూర్ గారాల కూతురు. ఈ అమ్మడు ఇప్పటికే ఇండస్ట్రీలో ఏమి జరుగుతుందో తెలుసుకుంది. జాన్వీకపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'కార్గిల్ గర్ల్' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసింది. షూటింగ్ స్పాట్ వాతావరణం ఇప్పటికే అలవాటు పడిందని.. కెమెరా యాంగిల్స్, షార్ట్స్ తదితర విషయాలు అవగాహనకు వచ్చాయని చెప్పుకొచ్చింది. దీంతో ఈ బ్యూటీ ఎంట్రీ కూడా త్వరలోనే ఉండబోతోందని తెలుస్తోంది.

సుహానా ఖాన్ : కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూతురిగా ఇప్పటికే అందరికి పరిచయమే. సినిమాల్లోకి రాకముందే స్టార్ గా మారిపోయింది. స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. షారుఖ్ ఖాన్ తన ఇద్దరు పిల్లలు సినీ ఇండస్ట్రీలో అడుగుపెడతారు అంటూ పలు సందర్భాలలో హింట్ ఇచ్చాడు. తన కొడుకు ఆర్యన్ ఖాన్ ఫిలింమేకర్ అవుతాడని.. కూతురు కోరుకుంటే తన స్టడీస్ పూర్తైన వెంటనే హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.

ఇబ్రహీం అలీఖాన్ : సైఫ్ అలీఖాన్ వారసుడు. ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది ఈ స్టార్ కిడ్ కి. తన సిస్టర్ సారా అలీఖాన్ తో కలిసి వర్క్ ఔట్స్ చేస్తూ ఇంటర్నెట్ లో కనువిందు చేస్తూనే ఉంటాడు. అంతేకాకుండా ఈ మధ్య ఒక టిక్ టాక్ వీడియోలో అద్భుతమైన నటన కనబరిచి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. దీంతో ఈయన ఎంట్రీ కూడా త్వరలోనే ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు.

ఖుషీ కపూర్ : అతిలోకసుందరి శ్రీదేవి చిన్న కూతురు. ఇప్పటికే తన అక్క జాహ్నవీ కపూర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన హవా కనబరుస్తోంది. ఇప్పటికే టిక్ టాక్ వీడియోలతో ఖుషీ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తూ వస్తోంది. గతంలో శ్రీదేవి తన కూతురు మోడల్ అవ్వాలని కోరుకుంటుందని ప్రకటించినప్పటికీ ఇప్పుడు ఖుషీ కూడా బాలీవుడ్ లో అడుగుపెట్టాలని ఆశపడుతున్నదట. అక్క జాహ్నవి లాగే పేరు తెచ్చుకోవాలని ఆశిస్తోందట. దీంతో ఈ అమ్మడి డెబ్యూ కూడా త్వరలోనే ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు.