Begin typing your search above and press return to search.

పుష్పగా చేయాలనుందన్న బాలీవుడ్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   13 July 2022 11:30 AM GMT
పుష్పగా చేయాలనుందన్న బాలీవుడ్‌ స్టార్‌
X
సౌత్ సినిమా ల స్థాయి ఈ మధ్య కాలంలో అమాంతం పెరిగిన విషయం తెల్సిందే. వరుసగా తెలుగు సినిమా లు హిందీ లో డబ్ అవ్వడంతో పాటు అక్కడ భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. అక్కడి ప్రేక్షకులు మాత్రమే కాకుండా అక్కడి సెలబ్రెటీలు ముఖ్యంగా బాలీవుడ్‌ స్టార్స్ కూడా మన సినిమాలను ఆధరిస్తూ చాలా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈగోలకు కొందరు పోయినా కొందరు మాత్రం మన సినిమాల గురించి చాలా పాజిటివ్ గా స్పందిస్తూ అక్కడ మరింతగా మన హీరోల మార్కెట్‌ పెరిగేలా చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్ కపూర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఇటీవల మీరు చేయాలనుకున్న ఏదైనా పాత్ర ఏంటి అంటూ ప్రశ్నించగా పుష్ప రాజ్ అంటూ సమాధానం చెప్పాడు.

అల్లు అర్జున్‌ మరియు సుకుమార్‌ ల కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప సినిమా ను గురించి ఇప్పటికి కూడా బాలీవుడ్‌ వర్గాల వారు చర్చించుకుంటున్నారు అంటే సినిమా స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా రణబీర్‌ కపూర్ తన సినిమా షంషేరా ప్రమోషన్‌ లో భాగంగా మీడియాతో మాట్లాడాడు. ఆ సందర్భంగా పుష్ప గురించి మాట్లాడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ నటించిన తీరుపై కూడా ఆయన కామెంట్స్ చేశాడు. పుష్ప రాజ్ పాత్రకు బాగా న్యాయం చేశాడని.. అద్భుతమైన మానరిజంతో అల్లు అర్జున్‌ ఆకట్టుకున్నాడు.

పుష్ప రాజ్‌ రోల్‌ ను తాను చేయాలని అనుకుంటున్నట్లుగా చెప్పడం ద్వారా పుష్ప ను ఆయన ఎంతగా ఓన్ చేసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. పుష్ప పార్ట్‌ 2 కోసం అందరు ప్రేక్షకుల మాదిరిగా తాను ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా పుష్ప సిగ్నేచర్ డైలాగ్‌ తగ్గేదే లే చెప్పడంతో పాటు యాక్ట్‌ చేశాడు.

పుష్ప పార్ట్‌ 2 కోసం ఏ స్థాయిలో ఎదురు చూపులు ఉన్నాయో రణబీర్‌ కపూర్ వ్యాఖ్యలను చూస్తే అర్థం అవుతుంది. సినిమా పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి కనుకే కాస్త ఆలస్యం అయినా కూడా పుష్ప 2 సినిమా ను అద్భుతంగా తీసుకు వస్తామంటూ సుకుమార్‌ టీమ్‌ చెబుతున్నారు.