Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌ లో కొత్త మెరుపులు

By:  Tupaki Desk   |   9 Sep 2018 5:30 PM GMT
బాలీవుడ్‌ లో కొత్త మెరుపులు
X
ఎవ్వెరి డాగ్ హాజ్ ఏ డే.. ప్రతి కుక్క‌కు ఒక రోజొస్తుంది. ఒక‌ప్పుడు టాప్ మోడ‌ల్స్ నేడు అగ్ర‌క‌థానాయిక‌లుగా రాజ్య‌మేలుతున్న సందర్భం క‌ళ్ల‌ముందే క‌నిపిస్తోంది. క‌పూర్ బ్యాక్‌ గ్రౌండ్‌ - ఖాన్‌ ల బ్యాక్‌ గ్రౌండ్ ఉంటేనే క‌థానాయిక‌లుగా రాణించ‌గ‌ల‌రా? అంటే అంత అవ‌స‌రం క‌నిపించ‌డం లేదు. అందం - అభిన‌యం - చొర‌వ‌ - దూసుకుపోయే తత్వం ఉండి... అప్‌డేట్ అవుతూ అల్ట్రా మోడ్ర‌న్ స్టైల్లో త‌మ‌ని తాము ప్ర‌మోట్ చేసుకోగ‌లిగితే అటు ఉత్త‌రాది నుంచి ద‌క్షిణాది వ‌ర‌కూ ఎన్నో అవ‌కాశాలు. స‌రిహ‌ద్దుల‌తో ప‌నే లేకుండా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో అందాల భామ‌ల‌కు అవ‌కాశాలొస్తున్నాయి.

ఇలా వ‌చ్చిన భామ‌ల్లో చాలామంది నిరూపించుకుని తారా జువ్వ‌ల్లా దూసుకుపోయే ట్యాలెంటు క‌ళ్ల‌ముందే క‌నిపిస్తోంది. ఆ త‌ర‌హాలోనే వ‌చ్చి నేటి నంబ‌ర్ వ‌న్ క‌థానాయిక గా వెలిగిపోతున్న దీపిక ప‌దుకొనే ఒక‌ప్పుడు టాప్ మోడ‌ల్‌. కింగ్ ఫిష‌ర్ క్యాలెండ‌ర్ గాళ్‌ గానే బ‌రిలో దిగింది. మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ మోడ‌లింగ్ లో రాణించాకే సినీతార‌గా అవ‌కాశాలు అందుకుంది. అలానే బాలీవుడ్‌ లో టాప్ 10 స్టార్లుగా వెలిగులు విర‌జిమ్మిన క‌త్రిన‌ - కంగ‌న - క‌రీనా ఒక‌ప్పుడు సూప‌ర్‌ మోడ‌ల్స్ గా వెలుగులు వెలిగిన వారే. న‌వ‌త‌రంలో దిశా ప‌టానీ - కృతి స‌నోన్ త‌మ‌ని తాము ప్ర‌మోట్ చేసుకుంటూ తారా జువ్వ‌ల్లా దూసుకుపోతున్నారు.

వీళ్ల‌తో పాటు ఇంకెవ‌రున్నారు? అని వెతికితే... పాత నీరు వెళుతుంటే కొత్త నీరు వ‌చ్చి చేరుతున్న చందంగా కొత్త భామ‌లు ఉత్త‌రాది ప‌రిశ్ర‌మ‌లో వెల్లువెత్తుతున్నారు. టాప్ మోడ‌ల్స్ న‌టాషా సూరి - స‌ప్నా ప‌బ్బి - రీనా - రుషి సింగ్ - హీనా హ‌ర్వాణీ ఒక్క ఛాన్స్ అంటూ వ‌చ్చి ఇప్పుడు ప‌లు క్రేజీ చిత్రాల్లో న‌టించేస్తున్నారు. న‌టాషా - సప్నా వంటి తార‌లు ఇటు సౌత్‌ లోనూ హాట్ టాపిక్‌. సైలెంటుగా సినీ కెరీర్ ని ప‌రుగులు పెట్టించే ప‌నిలో ఉన్నారు. నిరంత‌రం సామాజిక మాధ్య‌మాల్లో వేడెక్కించే ఫోటోషూట్ల‌తో అభిమానుల‌కు ట‌చ్‌ లో ఉంటున్న ఈ భామ‌లు మునుముందు పెద్ద స్టార్లుగా ఎదిగేస్తారన‌డంలో సందేహ‌మే లేదు. ఇక సినీ వినీలాకాశంలో పెద్ద పారితోషికాలు అందుకుని ఫేజ్ 3 వ‌ర‌ల్డ్‌ ని ఏలాల‌ని క‌ల‌లుగ‌నే అమ్మ‌ణ్ణులు ముంబై - క‌ల‌క‌త్తా - చెన్న‌య్‌ - హైద‌రాబాద్‌ లో కుప్ప‌లు కుప్ప‌లుగా ఉన్నారు. వీళ్ల నుంచి ఏ భామ‌ను ఏ అవకాశం వ‌రిస్తుందో చెప్ప‌లేం. ఒక్క‌ హిట్టు కొట్టి ఆ తర్వాత స్కై లెవ‌ల్‌ కి ఎదిగేసే భామ‌లెంద‌రో.