Begin typing your search above and press return to search.

ఆ తెలుగు హీరోతో నటించాలని ఉందన్న బాలీవుడ్‌ స్టార్‌ హీరో

By:  Tupaki Desk   |   5 April 2022 11:30 AM GMT
ఆ తెలుగు హీరోతో నటించాలని ఉందన్న బాలీవుడ్‌ స్టార్‌ హీరో
X
సౌత్‌ సినిమా.. బాలీవుడ్‌ సినిమా అనే హద్దులు చెరిగి పోయే రోజులు రాబోతున్నాయి. ఆ హద్దులను సౌత్‌ సినిమాలు చెరిపేస్తూ వస్తున్నాయి. పాన్ ఇండియా సినిమా అని కాకుండా ఇండియన్ సినిమా లు అంటూ ప్రేక్షకుల ముందుకు ముందు ముందు పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కాబోతున్నాయి. ప్రాంతీయ భాషల్లో విడుదల అయిన సినిమాలను ఇండియన్ సినిమాలుగా డబ్బింగ్‌ చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

ఒకప్పుడు బాలీవుడ్‌ స్టార్స్ కు ఫిల్మ్ మేకర్స్ కు సౌత్‌ సినిమా ఇండస్ట్రీ అంటే చాలా చిన్నచూపు ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. మన స్టార్ హీరోలను వారు అభిమానించే స్థాయిని మన హీరోలు ఎదిగారు అనడంలో సందేహం లేదు. రాజమౌళి తో బాలీవుడ్‌ లో ఎంతటి పెద్ద స్టార్‌ అయినా సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఇక మన హీరోలతో అక్కడి హీరోలు కలిసి నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్ కపూర్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీపై చాలా ప్రేమ పెరుగుతున్నట్లుగా ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది. ఇప్పటికే ఆయన హీరోగా వరుసగా తెలుగు సినిమాలను రీమేక్‌ చేస్తున్నాడు.

నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా ను రీమేక్ చేసిన షాహిద్ ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

తాజాగా దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరితో కలిసి హీరో షాహిద్‌ కపూర్ మరియు హీరోయిన్‌ మీడియా ముందుకు వచ్చారు. జెర్సీ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడిన షాహిద్‌ కపూర్‌ ను తెలుగు లో ఏ హీరో అంటే అభిమానం.. ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని భావిస్తున్నారు అంటూ ప్రశ్నించగా ఆయన చెప్పిన సమాధానం బన్నీ అభిమానులకు సంతోషాన్ని కలిగించింది.

అల్లు అర్జున్‌ తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్‌ పుష్ప సినిమాకు సంబంధించిన శ్రీవల్లి స్టెప్‌ ను కూడా ఈయన చేశాడు. హీరోగా షాహిద్‌ కపూర్‌ బాలీవుడ్‌ లో దూసుకు పోతున్నాడు. పుష్ప సినిమా తో బన్నీ పాన్ ఇండియా స్టార్‌ గా నిలిచాడు. కనుక వీరిద్దరి కాంబోలో ఒక భారీ పాన్‌ ఇండియా మూవీ వస్తే బాగుంటుంది అనే అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.