Begin typing your search above and press return to search.

RC15 లో బాలీవుడ్ స్టార్ హీరో తల్లి..?

By:  Tupaki Desk   |   21 Jun 2022 8:30 AM GMT
RC15 లో బాలీవుడ్ స్టార్ హీరో తల్లి..?
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. సమాజానికి స్ఫూర్తినిచ్చిన ఎందరో నిజాయితీ గల అధికారులపై ఆధారపడి ఉంటుందని చరణ్ ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు.

తాజాగా వినిపిస్తోన్న టాక్ ప్రకారం RC15 సినిమాలో ఒక కీలక పాత్ర ఉందట. అదొక పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్ర అని అంటున్నారు. దీని కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తల్లి, సీనియర్ నటి నీతూ కపూర్ ను సంప్రదిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో #RC15 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్ర అయితే.. మరొకటి ప్రభుత్వోద్యోగి పాత్ర అని అంటున్నారు. ఇప్పటికే లీకైన ఫోటోలలో చెర్రీ లుక్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది.

శంకర్ తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్ లో చూపిస్తుంటారు. ఇప్పుడు చరణ్ ను కూడా అలానే వినూత్నంగా చూపించబోతున్నాడని టాక్. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. 'వినయ విధేయ రామ' తర్వాత వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న రెండో సినిమా ఇది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది దిల్ రాజు బ్యానర్ లో రూపొందే 50వ సినిమా కావడం గమనార్హం. అంజలి - సునీల్ - శ్రీకాంత్ - జయరామ్ - నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది సమ్మర్ లో RC15 ను రిలీజ్ చేయనున్నారు.