Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌30 లో బాలీవుడ్‌ స్టార్‌ గెస్ట్ ఆర్టిస్ట్‌

By:  Tupaki Desk   |   3 July 2021 9:00 PM IST
ఎన్టీఆర్‌30 లో బాలీవుడ్‌ స్టార్‌ గెస్ట్ ఆర్టిస్ట్‌
X
ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల చివరి వరకు లేదా వచ్చే నెలలో షూటింగ్‌ పూర్తి అవ్వబోతుందని సమాచారం అందుతోంది. ఎప్పుడెప్పుడు ఆర్‌ ఆర్‌ ఆర్‌ షూటింగ్‌ ముగుస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జక్కన్న నుండి విముక్తుడు అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ 30 సినిమా ప్రారంభం అవ్వబోతుంది.

వీరిద్దరి కాంబోలో ఇప్పటికే జనతా గ్యారేస్‌ సినిమా వచ్చింది. ఆ సినిమా కు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది. కాని ఫ్యాన్స్‌ ఆశించిన స్థాయిలో రికార్డులను బ్రేక్‌ చేయలేదు. ఇప్పుడు అభిమానుల కోరిక మేరకు రికార్డులు బ్రేక్ చేసేలా ఎన్టీఆర్‌ 30 ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన చిన్న విషయంలో కూడా ఆయన తగ్గకుండా భారీగా తీస్తారని నమ్మకంతో అభిమానులు ఉన్నారు.

ఇప్పటి వరకు అపజయం ఎరుగని కొరటాల శివ ఆచార్యతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాడని ముందే అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఆచార్య సక్సెస్ తర్వాత ఖచ్చితంగా కొరటాల శివ ఎన్టీఆర్‌30 తో మరో సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. ఎన్టీఆర్‌ 30 ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే ఈ సినిమాలో బాలీవుడ్‌ మొహాలను చూపించబోతున్నారు.

ఇప్పటికే బాలీవుడ్ లో వరుస చిత్రాలతో దూసుకు పోతున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీని ఎంపిక చేయడం జరిగింది. ఇక కీలక పాత్రలో బాలీవుడ్‌ స్టార్ నటుడు బోమన్ ఇరానీని కూడా ఈ సినిమా కోసం ఎంపిక చేయడం జరిగిందట. ఈయన తెలుగు లో నటించడం ఇదే మొదటి సారి ఏమీ కాదు. గతంలో పలు సినిమా ల్లో ఈయన నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు గెస్ట్‌ ఆర్టిస్టుగా మారిపోయాడు.

అప్పుడప్పుడు వచ్చి అలా ఎంటర్ టైన్‌ మెంట్ అందించి వెళ్తూ ఉన్న బోమన్‌ ఇరానీ మొదట పవన్‌ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించి మెప్పించాడు. ఆ తర్వాత రవితేజ నటించిన బెంగాల్ టైగర్‌ లో కూడా ఈయన కనిపించాడు. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాత వాసి సినిమాలో కూడా బోమన్ ఇరానీ నటించాడు. కాని ఆ సినిమా నిరాశ పర్చింది. నా పేరు సూర్య సినిమాలో కూడా బోమన్‌ కనిపించాడు.

ఆ రెండు సినిమా ల ప్లాప్ తర్వాత బోమన్ ఇరానీ తెలుగు లో మళ్లీ కనిపించలేదు. ఇన్నాళ్లకు ఎన్టీఆర్ 30 లో నటించబోతున్నాడు. జనతా గ్యారేజ్ సినిమా లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను తీసుకు వచ్చిన కొరటాల శివ ఈ సినిమాకు గాను బాలీవుడ్‌ స్టార్‌ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఈయన ప్రజెన్స్ తో బాలీవుడ్‌ లో ఖచ్చితంగా సినిమాకు బజ్‌ క్రియేట్‌ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.