Begin typing your search above and press return to search.

సౌత్ పై మోజుప‌డ్డ బాలీవుడ్ స్టార్ క‌పుల్

By:  Tupaki Desk   |   7 Aug 2020 2:20 PM IST
సౌత్ పై మోజుప‌డ్డ బాలీవుడ్ స్టార్ క‌పుల్
X
`మెరుపు క‌ల‌లు` సినిమాతో కాజోల్ యూత్ ని ఓ ఊపు ఊపిన సంగ‌తి తెలిసిందే. అర‌వింద స్వామి అంత‌టి అంద‌గాడు వెంట‌ప‌డి ప్రేమిస్తుంటే అత‌డిని కాద‌ని ప్ర‌భుదేవాను ప్రేమిస్తుంది కాజోల్. మూవీలో ఆ థీమ్ లైన్ యూత్ కి బాగా క‌నెక్ట‌య్యింది. అంతేకాదు.. ఈ మూవీలో వెన్నెల‌వే వెన్నెల‌వే పాట‌కు కాజోల్ ఎక్స్ ప్రెష‌న్స్ ని మ‌న యూత్ ని ఎంత‌గా ఆక‌ట్టుకుందో చెప్పాల్సిన ప‌నే లేదు.

ఆ త‌ర్వాత కాజోల్ బాలీవుడ్ కే అంకిత‌మైంది. అక్క‌డ కెరీర్ ప‌రంగా బిజీగా ఉండ‌గానే యాక్ష‌న్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ ని పెళ్లాడింది. ఇటీవ‌లే ధ‌నుష్ న‌టించిన‌ త‌మిళ్‌- తెలుగు ద్విభాషా చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అదంతా స‌రే కానీ.. ఇటీవ‌లి కాలంలో భ‌ర్త అజ‌య్ దేవ‌గ‌న్‌ తో క‌లిసి కాజోల్ అదిరిపోయే మాస్ట‌ర్ ప్లాన్ వేయ‌డం కోలీవుడ్ లో చ‌ర్చ‌కొచ్చింది.

ప్ర‌స్తుతం సౌత్ మీద మోజు పడుతున్న బాలీవుడ్ స్టార్ దంపతులు! అంటూ కోలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వేడెక్కించేస్తున్నాయి. అజయ్ - కాజోల్ దంపతులకు సౌత్ పై ఉన్న‌ట్టుండి మోజు పెరిగిపోతోంద‌ట‌. అందుకే ఈ జంట‌ ఎంతో కీలకమైన తమ కూతురు లాంచింగ్ మూవీని ఇక్క‌డే ప్లాన్ చేస్తున్నారు. కాజోల్ - అజయ్ ల గారాల‌ప‌ట్టీ నైనా దేవ‌గ‌న్ `డాక్ట‌ర్` అనే సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఇందులో త‌ను కీలక పాత్ర పోషిస్తోంది కానీ హీరోయిన్ గా చేయ‌డం లేదు‌. శివ కార్తికేయన్ ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తున్నాడు. అయితే ఈ జంట ఎందుకిలా ప్లాన్ చేశారు? అంటే .. బాలీవుడ్ కి అవ‌స‌ర‌మ‌య్యే పోష్ క‌ల‌రింగ్ నైనాలో లేక‌పోవ‌డ‌మేనా? అంటూ గుసగుస‌లు వేడెక్కించేస్తున్నాయ్.