Begin typing your search above and press return to search.

ఈ కూతుళ్లంతా కాబోయే స్టార్ హీరోయిన్లే!

By:  Tupaki Desk   |   1 Nov 2016 5:30 PM GMT
ఈ కూతుళ్లంతా కాబోయే స్టార్ హీరోయిన్లే!
X
టాలీవుడ్ లో అంటే.. స్టార్ల వారసులు హీరోలుగా మాత్రమే అరంగేట్రం చేయాలనే రూల్ ఉంది కానీ.. వేరే ఏ ఇండస్ట్రీని చూసినా కూతుళ్లు కూడా సత్తా చాటేస్తుంటారు. బాలీవుడ్ లో అయితే.. కొడుకు కూతురు లాంటి తేడాలు కూడా అసలేమీ ఉండవు. ఇప్పటికే చాలామంది స్టార్ డాటర్స్ హీరోయిన్స్ అయిపోతే.. ఇకపై రానున్న వారు కూడా చాలామందే ఉన్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్.. మాజీ హీరోయిన్ అమృతా సింగ్ ల కుమార్తె అయిన సారా ఆలీ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్. త్వరలో ఈమె సినీ అరంగేట్రం చేస్తుందనే అంచనాలున్నాయి. అందాలతార శ్రీదేవి-బోనీకపూర్ ల కూతురు జాన్వి కపూర్ కూడా త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఖాయమే. జాకీష్రాఫ్-అయేషా దత్ ల కూతురు కృష్ణ ష్రాఫ్ కు ఇప్పటికే ఆన్ లైన్ లో బోలెడంత క్రేజ్ ఉంది. అప్పుడప్పుడు గ్లామర్ షోలో కొత్త యాంగిల్స్ తో ఇప్పటికే విపరీతమైన ఫాలోయింగ్ దక్కించేసుకుంది కూడా.

అమితాబ్ కూతురు కూతురు అయిన నవ్య నవేలీ నందా కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసి స్టార్ హీరోయిన్ గా మారిపోయేందుకు అన్ని అవకాశాలు ఉన్న టీనేజ్ బ్యూటీనే. పూజా బేడీ కూతురు ఆలియా ఇబ్రహీం కూడా ఫిలిం ఎంట్రీ కోసం రెడీ అవుతున్న సుందరాంగే. అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే అంచనాలున్నాయి.

షారూక్ ఖాన్ డాటర్ సుహానా ఖాన్ కూడా సినీరంగ ప్రవేశం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అమీర్ ఖాన్-రీనా దత్తాల కుమార్తె ఇరా ఖాన్ కూడా సరైన ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న వారిలోనే ఉంది. సంజయ్ దత్-రిచా శర్మల కూతురైన త్రిషాల దత్ కూడా ఈ లిస్ట్ లో ప్రముఖ స్థానంలోనే ఉంటుంది.

ఇప్పటికే వీరిలో చాలా మందికి సోషల్ మీడియాలో భయంకరమైన ఫాలోయింగ్ ఉండగా.. వీరందరూ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంతమంది స్టార్ వారసులు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చేస్తే అప్పుడు బాలీవుడ్ లో వెలుగుల జిలుగులు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకుంటేనే మైండ్ బ్లాంక్ అయిపోవడం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/