Begin typing your search above and press return to search.
ఆ స్టార్ హీరో సినిమా ఎనిమిదోసారి వాయిదా!
By: Tupaki Desk | 7 Jun 2023 5:00 AMబాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటిస్తోన్న `మైదాన్` రిలీజ్ వాయిదాల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే ఏడు సార్లు వాయిదా పడిన చిత్రం మరోసారి అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తుంది. ఎట్టకేలకు ఈనెల 23న రిలీజ్ అవుతుందని ఆశలు పెట్టుకున్న అభిమానులకు మరోసారి నిరాశ తప్పేలా లేదు. ఆ తేదీన కూడా సినిమా రిలీజ్ అవ్వడం తాజాగా వెలుగులోకి వస్తుంది. మరో కొత్త రిలీజ్ తేదీ కోసం యూనిట్ చూస్తున్నట్లు సమాచారం. మరి ఇలా ఎందుకు జరుగుతుంది.
రిలీజ్ ఏ కారణంతో వాయిదా వేస్తున్నారు. తేదీ ప్రకటించి మరీ వెనక్కి తగ్గడం వెనుక అసలు కారణాలు ఏంటి? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సినిమా షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిచేసుకుంది. కాపీ కూడా సిద్దమైంది. కానీ రిలీజ్ కి మాత్రం నోచుకోవడం లేదు. ఇలా వాయిదాల పర్వం ఎదుర్కోవడం అజయ్ కెరీర్ లో తొలిసారి. ఇంతవరకూ ఆయన నటించిన ఏ సినిమాకి ఇలా జరగలేదు. వాయిదాలు పడిన సందర్భాలున్నాయి. కానీ ఇలా తేదీలు ప్రకటించి వెనక్కి వెళ్లింది లేదు.
ప్రస్తుతం బాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలేవి కూడా రిలీజ్ కి లేవు. కావాల్సినన్ని థియేటర్లు దొరుకు తాయి. దీంతో కొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి. నేరుగా థియేటర్లో రిలీజ్ చేస్తారా? లేక ఓటీటికి వెళ్లే ఆలోచనలో భాగంగా యూనిట్ వాయిదా వేస్తుందా? అని డౌట్ రెయిజ్ అవుతుంది. ఇది ఓటీటీ సినిమా కాదు. ఫుట్ బాల్ లెజెండ్ ..కోచ్ సయ్యద్ అబ్ధుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ఇందులో అజయ్ సయ్యద్ పాత్రలో కనిపించనున్నారు. బయోపిక్ ఫ్యాన్స్ అంతా `మైదాన్` కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ల ఆశలపై..అంచనాలపై మేకర్స్ ఇలా నీళ్లు చల్లేస్తున్నారు. ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉండటంతో విక్రమ్ భట్ నిర్మిస్తోన్న `1920 హారర్స్ ఆఫ్ ది ఆర్ట్` రిలీజ్ అవుతుందని సమాచారం.