Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: సౌత్ లో రీమేకైన బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇవే

By:  Tupaki Desk   |   18 Sep 2020 1:30 AM GMT
టాప్ స్టోరి: సౌత్ లో రీమేకైన బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇవే
X
ఇటీవ‌ల వ‌రుస‌గా సౌత్ బ్లాక్ బస్టర్స్ బాలీవుడ్ లో రీమేక్ అవ్వడం బాక్సాఫీస్ సంచ‌ల‌నాలుగా మారడం మనం చూశాం. సింబా- వాంటెడ్- రౌడీ రాథోడ్- కబీర్ సింగ్- హాలిడే ఇలా ఎన్నో ఉదాహరణలు. అయితే సౌత్ టు హిందీ ఓకే కానీ.. హిందీ నుంచి తెలుగులోకి రీమేకైన‌వి ఎన్ని ఉన్నాయి? అంటే వంద శాతం తెలిసింది త‌క్కువే. బాలీవుడ్ హిట్ ల నుండి ప్రేరణ పొందిన దక్షిణాది చిత్రాలు ఏవి అన్న‌ది షార్ట్ లిస్ట్ చేస్తే 3 ఇడియట్స్ నుండి నాన్బన్ వ‌ర‌కూ ప‌లు చిత్రాలు ఉన్నాయి.

రాజ్‌కుమార్ హిరానీ తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త్రి ఇడియట్స్ భారతీయ సినిమా హిస్ట‌రీలోనే స‌రికొత్త‌ మైలురాయి చిత్రాలలో ఒకటి. ఇది రూ .200 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన మొదటి చిత్రంగా అవతరించడమే కాకుండా హిందీ చిత్రాలకు చైనా మార్కెట్ తలుపులు తెరిచింది. 2012 లో శంకర్ 3 ఇడియట్స్ ను తమిళంలో రీమేక్ చేసారు. ఇందులో ద‌ళ‌పతి విజయ్- జీవా- శ్రీకాంత్- ఇలియానా డి క్రజ్- సత్యరాజ్ - సత్యన్ ముఖ్య పాత్రల్లో నటించారు.

మున్నా భాయ్ ఎంబిబిఎస్ తెలుగులో `శంకర్ దాదా ఎంబిబిఎస్` గా తెర‌కెక్కింది. రాజ్‌కుమార్ హిరాణీ ఈ బాలీవుడ్ చిత్రానికి క‌ర్త క‌ర్మ క్రియ‌. మెగాస్టార్ చిరంజీవి- శ్రీకాంత్- సోనాలి బింద్రే- పరేష్ రావల్ త‌దిత‌రులు న‌టించారు. త‌మిళంలో ఇదే సినిమా రీమేక్ లో కమల్ హాసన్ - స్నేహ- ప్రభు- ప్రకాష్ రాజ్ నటించారు. అక్క‌డ‌ వసూల్ రాజా ఎంబిబిఎస్ అనేది టైటిల్. ఇక ఇదే మూవీ క‌న్న‌డ‌లో ఉప్పి దాదా ఎంబీబీఎస్ పేరుతో తెర‌కెక్కింది. ఉపేంద్ర- ఉమా- అనంత్ నాగ్ త‌దిత‌రులు న‌టించారు.

సల్మాన్ ఖాన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ `దబాంగ్` ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో `గబ్బర్ సింగ్` గా తెలుగులో రీమేక్ చేశారు. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో శ్రుతి హాసన్- అభిమన్యు సింగ్- అజయ్- నాగినీడు- కోట శ్రీనివాస రావు కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు.

అసాధారణమైన క‌థ‌ కథనం నటనకు ప్రశంసలు పొందిన బ్లాక్ కామెడీ `దిల్లీ బెల్లీ` తమిళంలో `సెట్టై`గా రీమేకైంది. ఇందులో ఆర్య- అంజలి- సంతానం- ప్రేమ్‌జీ- హన్సిక మోత్వానీ ముఖ్య పాత్రల్లో నటించారు. నసీరుద్దీన్ షా - అనుపమ్ ఖేర్ కీల‌క పాత్ర‌లు పోషించిన `ఎ వెడ్నెస్ డే` తెలుగు త‌మిళంలో రీమేకై విడుదలైంది. నీరజ్ పాండే తెర‌కెక్కించిన ఈ థ్రిల్లర్ లో కమల్ హాసన్ -మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. `స్నిపర్ ఉన్నిపోల్ ఒరువన్` పేరుతో ఇది వేరే భాష‌లోకి రీమేక్ చేయబడింది.