Begin typing your search above and press return to search.

స్టార్స్‌ మేకర్‌ దృష్టి ఇప్పుడు మేనకోడలిపై..!

By:  Tupaki Desk   |   1 March 2019 6:47 AM GMT
స్టార్స్‌ మేకర్‌ దృష్టి ఇప్పుడు మేనకోడలిపై..!
X
ఇండియాస్‌ ఫేమస్‌ దర్శకుల్లో ముందు వరుసలో ఉండే ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ. భారీతనంకు పెట్టింది పేరైన సంజయ్‌ లీలా భన్సాలీ బాలీవుడ్‌ కు ఎంతో మంది స్టార్స్‌ ను అందించాడు. ప్రస్తుతం బాలీవుడ్‌ లో ఒక ఊపు ఊపుతున్న ఎందరో సంజయ్‌ లీలా భన్సాలీ తయారు చేసిన వారే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పీరియాడికల్‌ మూవీ, భారీ బడ్జెట్‌ చిత్రాలను చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించే సంజయ్‌ లీలా భన్సాలీ తన బ్యానర్‌ లో ఎంతో మంది నటీనటులను మరియు దర్శకులను కూడా పరిచయం చేయడం, ఎంతో మందికి బ్రేక్‌ ఇవ్వడం చేశాడు.

అలాంటి సంజయ్‌ లీలా భన్సాలీ ఇప్పుడు తన మేనకోడలు షర్మీన్‌ సెగల్‌ ను హీరోయిన్‌ గా పరిచయం చేసేందుకు సిద్దం అయ్యాడు. సినిమాలపై చాలా ఆసక్తిని పెంచుకున్న షర్మీన్‌ కు భన్సాలీ పూర్తి మద్దతుగా నిలిచాడు. నటనలో మెలుకువలు నేర్పడంతో పాటు, దర్శకత్వ శాఖలో కూడా చేర్చుకుని సినిమా మేకింగ్‌ విషయంలో ఆమెకు అవగాహణ కల్పించాడు. మేన కోడలితో ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాలను చేసేందుకు కమిట్‌ అయినట్లుగా అధికారికంగా ప్రకటించాడు. భన్సాలీ 'పద్మావత్‌' మూవీ తర్వాత మరే సినిమాను ప్రకటించలేదు.

ఇటీవలే సల్మాన్‌ ఖాన్‌ తో ఒక మూవీని భన్సాలీ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేల సల్మాన్‌ ఖాన్‌ తో భన్సాలీ సినిమా ఉంటే అందులో హీరోయిన్‌ గా షర్మీన్‌ ఉండే అవకాశం ఉంది. మొదటి సినిమానే సల్మాన్‌ వంటి సూపర్‌ స్టార్‌ తో చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా షర్మీన్‌ స్టార్‌ హీరోయిన్‌ అవ్వడం ఖాయం అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు. ఎంతో మందిని స్టార్స్‌ ను చేసిన భన్సాలీ తన మేనకోడలిని స్టార్‌ హీరోయిన్‌ గా చేసే వరకు పట్టుదలగా ప్రయత్నించడం ఖాయం. అంటే బాలీవుడ్‌ లో మరో రెండు మూడు ఏళ్లలో షర్మీన్‌ స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం అంటూ బాలీవుడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.