Begin typing your search above and press return to search.
లాభాల్లో సగం స్టార్లే నొక్కేస్తున్నారని నిర్మాత కలత
By: Tupaki Desk | 8 Jan 2023 8:00 PM ISTహీరోలు సినీపరిశ్రమలో అందరినీ డామినేట్ చేస్తారనేది నిర్మాతల ఫ్రస్టేషన్. చివరికి డబ్బు పెట్టే తమను కూడా లెక్క చేయరు. హీరోలు ఏం ఆర్డర్ వేస్తే అది దర్శకనిర్మాతలు చేయాలని వాపోయే వాళ్లున్నారు. స్టార్ హీరోల స్టామినా గురించి వేదికలపై గొప్పగా పొగిడేసే నిర్మాతలకు ఎప్పుడు గుండె లయ తప్పుతుందో చెప్పలేం. కోట్లాది రూపాయల పారితోషికాలు ముట్టజెప్పేటప్పుడు కలిగే ఆవేదన అలా ఉంటుందని ఒక పెద్ద నిర్మాత వెల్లడించారు.
అదంతా అటుంచితే పెద్ద హీరో చిన్న హీరో అనే తేడా లేకుండా వీలున్న ప్రతి వేదిక పైనా అదుపు తప్పిన పారితోషికాలపై విరుచుకుపడిన దివంగత దర్శకరత్న డా.దాసరి నారాయణ రావు గారే .. హీరోసామ్యాన్ని ఆపలేకపోయారు. హీరోల ఏలిక ముందు పాలన ముందు ఎవరూ నిలబడలేరని ప్రూవ్ అయ్యింది. మారిన కల్చర్ తో పోటీపడలేక టాలీవుడ్ లో పేరున్న సంస్థలు విలువలున్న నిర్మాణ సంస్థలు ఎప్పుడో కనుమరుగయ్యాయి. తాజాగా బాలీవుడ్ అగ్రనిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యానం తెలుగు పరిశ్రమలో ముసిముసి నవ్వులకు కారణమైంది.
ఇంతకీ కరణ్ ఏమన్నారు? అంటే..యాభై శాతం లాభం స్టార్స్ కు వెళ్తుందని నిర్మాతకు మిగిలేది కడ కాళ్లే(లెగ్స్)నని అన్నారు. ఒక సినిమా నుండి వచ్చే లాభాలు ఎలా పంచుకుంటారు బాసూ? అని ప్రశ్నించగా కరణ్ తన ఆవేదనను వెల్లగక్కారు. పెద్ద హీరో ఎక్కువ మొత్తం గుంజుకుంటే.. ఆ తర్వాత దర్శకుడు మిగిలినదాంట్లో చాలా వరకూ లాగుతాడు. మరికొంత రచయితకు వెళుతుంది. నిర్మాతకు చివరి వాటా అందుతుందని ఆయన అన్నారు. పెద్ద దర్శకుడితో సినిమా అయితే... స్టార్ కి 50.. డైరెక్టర్ కి 30.. రైటర్ కి ఇంకొంచెం వెళుతుంది. నిర్మాతే చివరి వాటాదారు అని కరణ్ అన్నారు. పంపిణీదారులతో పోలిస్తే నటీనటులను ఒప్పించడం అంత సులువు కాదని తల బొప్పి కడుతుందని కూడా కరణ్ అన్నారు.
ఆయన కంటే ఇంకా గొప్ప అనుభవాలు పలువురు టాలీవుడ్ నిర్మాతలకు ఉన్నాయి. అగ్ర హీరోలతో టాప్ డైరెక్టర్లతో సినిమాలు చేసే చాలా మంది నిర్మాతలకు లాభాల మాట అటుంచితే రికవరీ చేసుకోవడమెలానో తెలియకపోతే లాభం ఉండదని వాపోయినవారు లేకపోలేదు. ఆ నలుగురిలా సమర్థవంతమైన రికవరీ రేటు అందరికీ ఉండనే ఉండదని సెలవిస్తుంటారు. నిజానికి 90 శాతం అందరికీ సర్ధేస్తే మిగిలిన 10-20శాతం తమ వరకూ వచ్చే అవకాశముందని వాపోయిన నిర్మాతలు టాలీవుడ్ లో కోకొల్లలు. సొంత స్టూడియోలు.. సొంత ల్యాబులు.. సొంత సెట్టింగులు వగైరా వగైరా అందుబాటులో ఉన్న నిర్మాతలు చాలా వరకూ సేవ్ అవుతారు కానీ.. కేవలం డబ్బు మూట మాత్రమే తెచ్చే నిర్మాతలు సేఫ్ అవ్వడమనేది చాలా అరుదు అని చెబుతుంటారు విశ్లేషకులు అనుభవజ్ఞులు. అదీ నేటి నిర్మాత పరిస్థితి.