Begin typing your search above and press return to search.

సినీ ఇండస్ట్రీలో విషాదం: కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి

By:  Tupaki Desk   |   6 Jun 2020 5:15 AM GMT
సినీ ఇండస్ట్రీలో విషాదం: కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి
X
మహారాష్ట్రను పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ఇప్పుడు సినీ ప్రముఖులను కూడా కబళిస్తోంది. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురిపై పంజా విసురుతోంది.

మహారాష్ట్ర రాజధాని ముంబైలో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. బాలీవుడ్ ప్రముఖులంతా అక్కడే ఉండడంతో వారికి ఈ వైరస్ సోకుతోంది. ఇప్పటికే బాలీవుడ్ కు చెందిన పలువురు వైరస్ తో మృతి చెందారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అనిల్ సూరి మరణించడం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది.హైఫీవర్ తో బాధపడుతున్న నిర్మాత అనిల్ సూరి ఆరోగ్యం విషమించడంతో లీలావతి ఆస్పత్రికి తరలించారని..అయితే ఆస్పత్రి సిబ్బంది ఆయనను అడ్మిట్ చేసుకోలేదని అతడి సోదరుడు తెలిపాడు.

ఆ తర్వాత ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించగా గురువారం సాయంత్రం చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు కరోనాగా నిర్ధారణ అయ్యింది. ఆ వైరస్ వల్లే పరిస్థితి విషమించి చనిపోయాడని వైద్యులు తెలిపారు.

నిర్మాత అనిల్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అనిల్ బాలీవుడ్ లో ‘రాజ్ కుమార్-రేఖ తో కలిసి ‘కర్మయోగి’, రాజ్ తిలక్ వంటి చిత్రాలు నిర్మించారు.