Begin typing your search above and press return to search.

బాలీవుడ్ టెంప్ట్ చేస్తోన్న అవ్వ‌ని సౌత్ హీరోలు!

By:  Tupaki Desk   |   13 Nov 2022 6:00 PM IST
బాలీవుడ్ టెంప్ట్ చేస్తోన్న అవ్వ‌ని సౌత్ హీరోలు!
X
తెలుగు..క‌న్న‌డ ప‌రిశ్ర‌మలు పాన్ ఇండియాలో ఓ వెలుగు వెలుగుతోన్న త‌రుణ‌మిది. బాలీవుడ్ ప‌రిశ్ర‌మ టాలీవుడ్ వైపు చూస్తోంది. త‌మ సినిమాల ప్ర‌చారం కోసం తెలుగు హీరోల మ‌ద్ద‌తు కొరుతున్నారంటే? స‌న్నివేశం ఎంత‌లా ట‌ర్న్ తీసుకుందో అద్దం ప‌డుతుంది. ఒక‌ప్పుడు బాలీవుడ్ వైపు చూసే హీరోలంతా తెలుగు వైపు చూస్తున్నారంటే? ఇక్క‌డి మార్కెట్ ఎంత‌గా ప్ర‌భావం చూపింద‌న్న‌ది క‌ళ్ల ముందు స్ప‌ష్టంగా కనిపిస్తుంది.

బాలీవుడ్ లో ఛాన్స్ అంటేనే ఎగిరి గంతేసి సినిమా చేసే రోజులు పోయాయ‌ని సౌత్ ప‌రిశ్ర‌మ‌లు రెండు చాటి చెబుతున్నాయి. ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాలీవుడ్ ఛాన్స్ ఇస్తే వెళ్తారా? అంటే త‌న‌దైన శైలిలో బ‌ధులిచ్చి తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పారు. బాహుబ‌లి స‌క్సెస్ త‌ర్వాత ప్ర‌భాస్ ని బాలీవుడ్ కి తీసుకెళ్లాల‌ని కర‌ణ్ జోహార్ లాంటి బ‌డా నిర్మాత‌లెంతో మంది ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యారు.

తెలుగు సినిమాలే ముద్ద‌ని ఇక్క‌డే సినిమాలు చేస్తున్నారాయ‌న‌. `ఆదిపురుష్` తో హిందీలో తెరంగేట్రం చేస్తోన్నడార్లింగ్ మొద‌టి చాయిస్ ఎప్పుడు మాతృభాష‌నే చెబుతుంటారు. ఇక `ఆర్ ఆర్ ఆర్` స‌క్సెస్ తో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చర‌ణ్ కి ఏకంగా హాలీవుడ్ అవ‌కాశాలే వచ్చాయి. కానీ సున్నితంగా ఆఛాన్స్ తిర‌స్క‌రించారు. దాని ముందు బాలీవుడ్ ఛాన్స్ ఎంత‌? న‌టుడిగా తెలుగులోనే అధిక సినిమాలు చేయాల‌ని ఆఢ‌ప‌డుతున్న న‌టుడాయ‌న‌.

అలాగే `పుష్ప` స‌క్సెస్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి హిందీ డోర్లు తెరుచుకున్నాయి. కానీ బ‌న్నీ కూడా అటువైపు చూస్తున్న‌ట్లు క‌నిపించ‌లేదు. అలాగే రానా... జూనియ‌ర్ ఎన్టీఆర్ లాంటి న‌టుల‌కు బాలీవుడ్ ఎప్ప‌టి నుంచో ఆహ్వానం ప‌లుకుతుంది. కానీ ఇక్క‌డి అవకాశాల‌కే పెద్ద పీట వేస్తున్నారు. ఇక క‌న్న‌డ న‌టులు రాకింగ్ స్టార్ య‌శ్ కి కేజీఎఫ్ హిట్ త‌ర్వాత బ‌డా సంస్థ‌లే క్యూ క‌ట్టాయి.

కానీ ఆయ‌న మాతృభాష‌ పై మ‌మ‌కారంతో అక్క‌డే సినిమాలు చేస్తాన‌న్నారు. ఇటీవ‌లే `కాంతార` హిట్ తో సంచ‌ల‌నం సృష్టించిన రిష‌బ్ శెట్టికి ఓ బ‌డా సంస్థ ఆఫ‌ర్ ఇచ్చింది. ఆయ‌న క‌న్న‌డిగుల్ని వదిలి పెట్టి వ‌చ్చేది లేద‌ని తేల్చేసారు. అలాగే మ‌రో యువ క‌న్న‌డ న‌టుడుకి బాలీవుడ్ త‌లుపులు తెరిచి పెట్టింది. ఆయ‌న కూడా నో చాన్స్ అనేసాడు. ఈ స‌న్ని వేశాలు అన్ని సౌత్ సినిమా స్థాయిని పెంచిన‌ట్లుగానే భావించాలి. ఒక‌ప్పుడు సినిమా ఇండ‌స్ర్టీ అంటే బాలీవుడ్ పేరు ఒక్క‌టే ఎక్కువ‌గా వినిపించేది. ఇప్పుడా సౌండింగ్ లో చాలా మార్పులొచ్చాయి. హిందీ ఆడియ‌న్స్ సైతం సౌత్ సినిమాల రిలీజ్ కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.