Begin typing your search above and press return to search.

బీబర్ కోసం ఎగబడ్డ బాలీవుడ్

By:  Tupaki Desk   |   11 May 2017 10:34 AM IST
బీబర్ కోసం ఎగబడ్డ బాలీవుడ్
X
హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్.. తొలిసారిగా ఇండియాలో లైవ్ కాన్సర్ట్ నిర్వహించాడు. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తన సూపర్ హిట్స్ లో పలు పాటలను పాడి ఆహుతులను అలరించాడు బైబర్. మార్క్ మై వర్డ్స్.. వేర్ ఆర్ యు నౌ.. గెట్ యూజ్డ్ టు ఇట్ వంటి సాంగ్స్ తో మొదలుపెట్టిన బైబర్.. ఆ తర్వాత స్పీడ్ పెంచేశాడు.

జస్టిన్ బీబర్ లైవ్ కాన్సర్ట్ కు బాలీవుడ్ తారలు విపరీతంగా హాజరయ్యారు. ముఖ్యంగా కుర్ర తరం అయితే.. ఎగబడిపోయిందనే చెప్పాలి. అలనాటి అందాల తార శ్రీదేవి తన కూతురు జాన్వితో కలిసి రాగా.. ఆలియా భట్.. దువ్వాడ జగన్నాధం హీరోయిన్ పూజా హెగ్డే.. మలైకా అరోరాతో పాటు.. అనేక మంది హీరోయిన్స్ ఇక్కడ సందడి చేశారు. అసలే హాలీవుడ్ స్టార్ పాప్ సింగర్ షో.. దీనికి బాలీవుడ్ యంగ్ జనరేషన్ ఏ రేంజ్ లో అటెండ్ అవ్వాలో.. అంతటి స్టైల్ ను చూపించేశారు. ఒక్కొక్కరి అందాలు.. స్టైలింగ్.. గెటప్స్.. విపరీతంగా అట్రాక్ట్ చేసేశాయి.

అయితే.. అన్నిటినీ బీబర్ షో డామినేట్ చేసేసిందనే చెప్పాలి. బాయ్ ఫ్రెండ్.. వాట్ డు యూ మీన్.. నో ప్రెజర్.. బేబీ పాటలు పాడుతున్నపుడు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చివరగా విపరీతంగా పాపులర్ అయిన 'సారీ' ఆల్బంతో ఆడియన్స్ అందరినీ తన పాటతో కట్టేసి.. షో ముగించాడు జస్టిన్ బీబర్.