Begin typing your search above and press return to search.

చిత్ర పరిశ్రమలో విషాదం: యువ సంగీత దర్శకుడి కన్నుమూత

By:  Tupaki Desk   |   1 Jun 2020 3:30 AM GMT
చిత్ర పరిశ్రమలో విషాదం: యువ సంగీత దర్శకుడి కన్నుమూత
X
యువ సంగీత దర్శకుడి కన్నుమూత చిత్ర పరిశ్రమలో విషాదం నింపింది. ఆయన మృతికి చిత్ర ప్రముఖులంతా షాక్ అయ్యారు. ఘనంగా నివాళులర్పించారు. కిడ్నీ వైఫల్యం, అనారోగ్యం వల్ల సంగీత దర్శకుడు 42 ఏళ్లకే కన్నుమూశారు.

హిందీ చిత్రపరిశ్రమలో మాస్ హిట్లకు కేరాఫ్ గా నిలిచిన సంగీత దర్శక జంట సాజిద్-వాజిద్ లలో ఒకరైన ప్రఖ్యాత బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ (42) తాజాగా కన్నుమూశారు. వాజిద్ ఖాన్ హఠాన్మరణం పట్ల బాలీవుడ్ చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. గాయకుడు సోనూ నిగమ్ సహా పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

వాజిద్ ఖాన్ కిడ్నీ వైఫల్యంతో కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది కిందటే ఆయనకు కిడ్నీ మార్పిడి జరిగింది. అయితే దానికి ఇన్ ఫెక్షన్ తిరగబెట్టిందని అంటున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్ తోపాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తాయని చెబుతున్నారు. 4 రోజుల కిందట వాజిద్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ముంబైలోని చెంబూర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా తేలినట్లు సమాచారం. అయితే అధికారికంగా ప్రకటించలేదు.కిడ్నీ ఫెయిల్యూర్ తోపాటు మహమ్మారి వైరస్ చుట్టుముట్టడంతో పరిస్థితి విషమించి వాజిద్ ఖాన్ మరణించినట్టు తెలుస్తోంది.

1998లో సల్మాన్ ఖాన్ హీరోగా ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ మూవీతో సాజిద్-వాజిద్ లు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోలేదు. సల్మాన్ చిత్రాలన్నంటికి వీరే సంగీతాన్ని అందించారు. దబాంగ్, పాగత్ పంతి, రౌడీ రాథోడ్, జుడ్వా, సింగ్ ఈజ్ బ్లింగ్ సహా మాస్ పెద్ద హిట్స్ ఇచ్చారు. వాజిద్ మరణంతో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.