Begin typing your search above and press return to search.

అఖిల్ అనవసరంగా టార్గెట్ అయ్యాడే

By:  Tupaki Desk   |   24 Aug 2017 4:16 PM IST
అఖిల్ అనవసరంగా టార్గెట్ అయ్యాడే
X
బాలీవుడ్ మూవీ మేకర్స్ తో పాటు.. అక్కడి ఆడియన్స్ కు కూడా తెలుగు సినిమా రంగం అంటే చులకనే. బాహుబలితో అక్కడి రికార్డులను అన్నిటినీ తెలుగు నుంచి డబ్బింగ్ అయిన సినిమా తుడిచిపెట్టేసినా.. వాళ్లలో అహంకారం ఏ మాత్రం తగ్గదు. పైగా అసలు విషయాలు తెలియకుండానే మనోళ్లను ఆడిపోసుకునేందుకు రెడీగా ఉంటారు.

ప్రస్తుతం వరుణ్ ధావన్ డబుల్ యాక్షన్ తో రూపొందిన జుడ్వా2 రిలీజ్ కు రెడీ అయిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ల క్రితం సల్మాన్ ఖాన్ నటించిన జుడ్వాకు సీక్వెల్ గానే ఈ మూవీ రూపొందుతోంది. అయితే.. ఈ జుడ్వా మూవీ... నాగార్జున నటించిన తెలుగు హలోబ్రదర్ కు రీమేక్. ఆ అభిమానంతోనే నాగ్ కుమారుడు అఖిల్.. తన తండ్రి నటించిన సినిమాల్లో హలో బ్రదర్ తన ఫ్యావరేట్ మూవీ అంటూ ట్వీట్ చేశాడు. అయితే.. అఖిల్ చేసిన ఈ కామెంట్ చాలామంది బాలీవుడ్ జనాలకు అర్ధం కాలేదు. పైగా వాళ్లే తెగ కన్ఫ్యూజ్ అయిపోయి.. జుడ్వాకు రీమేక్ గా నాగార్జున హలో బ్రదర్ సినిమా చేశాడంటూ కథనాలు అల్లేశారు. తన తండ్రి సినిమాల గురించి కూడా అఖిల్ కు తెలియదంటూ కామెడీలు చేసేసింది బాలీవుడ్ మీడియా.

నిజానికి ఇక్కడ అసలు విషయం తెలియనది.. పట్టించుకోనిది బాలీవుడ్ మీడియానే. అయినా సరే.. అక్కినేని కుర్రాడిని ఆడిపోసుకుంటూ.. ఆన్ లైన్‌ లో ట్రాలింగ్ చేసి పడేశారు. అఫ్ కోర్స్.. అన్నీ తెలిసిన మన జనాలు మాత్రం అఖిల్ కు అండగానే నిలబడ్డారు.