Begin typing your search above and press return to search.
బాలీవుడ్ మీడియా అప్పుడే మొదలెట్టిందిగా
By: Tupaki Desk | 18 Sept 2022 10:20 AM ISTబాలీవుడ్ మీడియా నిరంతర గాసిప్పుల్లో ఇటీవల తెలుగు హీరోల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇంతకుముందే నాగచైతన్య ఫలానా హీరోయిన్ తో సీక్రెట్ డేట్ లో ఉన్నారంటూ ఉత్తరాది మీడియా కథనాలు వండి వార్చింది. అయితే అవన్నీ గాసిప్పులేనని అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పైనా ఈ తరహా గాసిప్ వేడెక్కిస్తోంది. అతడు ఓ ట్యాలెంటెడ్ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ ఒకటే గుసగుసలతో హీటెక్కుతోంది.
ఆదిపురుష్ సహనటి కృతి సనన్ తో ప్రభాస్ డేటింగ్ చేస్తున్నారా? అంటూ...ఇటీవల కాఫీ విత్ కరణ్ లో కాలింగ్ సెగ్మెంట్ లో ప్రభాస్ కి కాల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన తర్వాత వారు `ప్రత్యేక` బంధాన్ని పంచుకుంటారా? అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆరోజు ఆ ఒక్క ఫోన్ కాల్ సృష్టించిన సంచలనంపై ఆ జంట స్పందించకపోయినా కానీ.. ప్రభాస్- కృతి సనన్ మధ్య రొమాన్స్ జరిగే అవకాశం ఉందన్న రూమర్లు ఆగడం లేదు. సోషల్ మీడియాల్లో ఇప్పటికే బోలెడంత గుసగుస నడుస్తోంది.
ప్రముఖ హిందీ మీడియా వివరాలను పరిశీలిస్తే ప్రభాస్ - కృతి సనన్ ఒకరి పట్ల ఒకరు `బలమైన లోతైన భావాలు` కలిగి ఉన్నారని మొదటి రోజు నుండి ఆదిపురుష్ సెట్స్ లో వారు ఒకరినొకరు దిగ్భంధించారని .. వారి బంధం అందరినీ ఆశ్చర్యపరిచేలా అనిపించిందని ఒక పుకార్ షికార్ చేస్తోంది. ప్రత్యేకించి ప్రభాస్ లాంటి సిగ్గుపడే వ్యక్తి కృతితో బహిరంగంగా మాట్లాడడం.. ఆమెతో సంభాషణలో చనువుగా తలమునకలుగా కనిపించారని సదరు కథనం పేర్కొంది.
స్నేహం గురించి ఆరా తీస్తే.. ఆ ఇద్దరి నడుమా అది ఏదో ఒక ప్రత్యేకత వల్ల ప్రారంభమైంది. కానీ ప్రపంచానికి ఏదైనా ధృవీకరించే వరకు ఈ జంట చాలా నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించడం వల్ల గాసిప్ బుల్లెట్లు ఇంకా దూకుడు పెంచడం లేదు.
కొన్ని నెలల క్రితమే సినిమా షూటింగును ముగించినప్పటికీ వారి స్నేహ బంధం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఈ జోడీ ఒకరికొకరు కాల్ లేదా మెసేజ్ చేయడంలో ఎప్పుడూ విఫలం కావడం లేదని ఒకరిపై ఒకరు పరస్పర అభిమానాన్ని కలిగి ఉన్నారని ఉత్తరాది మీడియా కథనాలు వండి వారుస్తోంది. కానీ దానిని ఒక సంబంధం అని పిలవడం చాలా తొందరపాటు అవుతుంది. నిజానికి సహనటులు తమ సినిమాల షూటింగ్ లను కలిసి ప్రమోట్ చేస్తున్నప్పుడు లింక్ అప్ చేయడం సర్వసాధారణం. కానీ కృతి -ప్రభాస్ జోడీ చాలా భిన్నంగా ఉంటారు. వారు నిజంగా ఒకరికొకరు బలమైన అనుభూతిని కలిగి ఉన్నా అదంతా సహజ ప్రాసెస్ లో లవ్ గా మారుతుందని అనవసరంగా దీనిపై తొందరపడకూడదని మాత్రమే ఆ ఇద్దరూ కోరుకుంటున్నారని ఒక కొత్త ప్రచారం తెరపైకొచ్చింది.
గత సంవత్సరం కృతి ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి తన మొదటి అభిప్రాయాన్ని తెలిపింది. మొదట అతను బాగా సిగ్గుపడేవాడని భావించానని అయితే చాట్ చేయడం ప్రారంభించిన తర్వాత అతను ఇక ఆగలేకపోయాడని చెప్పింది. ప్రభాస్ ఆహార ప్రియుడు.. అతని సహనటులకు ప్రేమగా ఆహారం ఇవ్వడానికి చాలా ఇష్టపడతారు! అని మార్చి 2021లో ప్రముఖ జాతీయ మీడియాతో అన్నారు. ప్రస్తుతం పెదనాన్న కృష్ణంరాజు మృతితో ప్రభాస్ తీవ్ర కలతలో ఉన్నారు. అయినా ముంబై మీడియాలో ఇలాంటి కథనాలు ఆగడం లేదు. కృతితో డార్లింగ్ స్నేహం ఎంతవరకూ?... కొన్నిటికి కాలమే సమాధానమివ్వాలి.