Begin typing your search above and press return to search.

ప్రభాస్ పై తొందరపడుతున్న బాలీవుడ్

By:  Tupaki Desk   |   14 Jun 2017 6:25 PM
ప్రభాస్ పై తొందరపడుతున్న బాలీవుడ్
X
టాలీవుడ్ హీరో ప్రభాస్ ఇప్పుడు నేషనల్ లెవెల్ ఐకాన్ అనడంలో సందేహం అక్కర్లేదు. బాహుబలి2 తర్వాత యంగ్ రెబల్ స్టార్ కు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడిపోయింది. ప్రభాస్ పేరుంటే చాలు బోలెడన్ని వ్యూస్.. క్లిక్స్ వచ్చేస్తున్నాయి. అందుకే మన హీరో క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బాలీవుడ్ మీడియా తెగ తాపత్రయ పడిపోతోంది. ప్రభాస్ పై రకరకాల కథనాలు వండి వడ్డించేస్తోంది.

ప్రతీ రోజూ ప్రభాస్ పై ఏదో ఒక అప్ డేట్ ఉండేలా బాలీవుడ్ మీడియా స్టోరీలు అల్లేస్తోంది. ప్రభాస్ కు ఈ స్థాయి గుర్తింపు రావడం మనం గర్వించాల్సిన విషయమే అయినా.. ఈ హడావిడిలో ప్రభాస్ పై రూమర్స్ ను.. అలాగే దారుణమైన స్టేట్మెంట్స్ ను కూడా ఇచ్చేస్తున్నారు. అనుష్కతో ప్రభాస్ కు ఎంగేజ్మెంట్ అయిందంటూ.. కొన్ని రోజుల క్రితం ఓ మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. అదే మీడియా రెండు రోజుల గ్యాప్ తర్వాత.. ప్రభాస్-అనుష్క బ్రేకప్ చెప్పేసుకున్నారని రాసేసింది. ఆ తర్వాత ప్రభాస్ కు వేరే అమ్మాయితో నిశ్చితార్ధం జరిగందంటూ మరో స్టోరీ వచ్చింది.

ఇప్పుడు ప్రభాస్ ఒక్కో సినిమాకు 80 నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడంటూ కొత్త కథనాలు వస్తున్నాయి. ఇన్నేసి అబద్ధపు వార్తలు వస్తుండడం ప్రభాస్ ను కొంత కలవరపెడుతోందట. అయితే.. వీటిపై రియాక్ట్ అవడం సరికాదని పలువురు సన్నిహితులు సూచించడంతో.. మిన్నకుండిపోయాడట ప్రభాస్.