Begin typing your search above and press return to search.

మూడు త‌రాల న‌టుల‌తో బాలీవుడ్ మ‌నం!

By:  Tupaki Desk   |   1 Dec 2020 10:45 AM IST
మూడు త‌రాల న‌టుల‌తో బాలీవుడ్ మ‌నం!
X
సీనియ‌ర్ న‌టుడు ధర్మేంద్ర ఆయ‌న ఫ్యామిలీ హీరోలంతా బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మ‌నుగ‌డ సాగిస్తున్న విష‌యం తెలిసిందే. స‌న్నిడియోల్‌- బాబీ డియోల్ ఇద్ద‌రూ హీరోలుగా న‌టించి మెప్పించారు. తండ్రి ధ‌ర్మేంద్ర‌తో క‌లిసి `య‌మ్లా పాగ్లా దీవానా` చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ ‌గా వ‌చ్చిన `య‌మ్లా పాగ్లా దీవానా 2`, `య‌మ్లా పాగ్లా దీవానా ఫ‌ర్‌సే` వంటి చిత్రాల్లో క‌లిసి న‌టించారు.

తొలిసారి ధ‌ర్మేంద్ర ఫ్యామిలీకి చెందిన మూడు త‌రాల న‌టులంతా క‌లిసి ఓ మూవీలో న‌టించ‌బోతున్నారు. ఇందులో ధ‌ర్మేంద్ర‌- సన్నీ డియోల్- బాబీ డియోల్ తో పాటు మూడ‌వ త‌రం న‌టుడు స‌న్నిడియోల్ కుమారుడు కరణ్ సింగ్ డియోల్ కూడా ఈ చిత్రంలో న‌టించ‌బోతున్నాడు. అంటే అక్కినేని ఫ్యామిలీ హీరోలు న‌టించిన‌ `మ‌నం` త‌ర‌హాలో ధ‌ర్మేంద్ర ఫ్యామిలీ హీరోలంతా క‌లిసి ఒకే చిత్రంలో న‌టించి రికార్డు సృష్టించ‌బోతున్నార‌న్న‌మాట‌.

ధర్మేంద్ర అతని ఇద్దరు కుమారులు సన్నీ.. బాబీ డియోల్.. మనవడు కరణ్ డియోల్ క‌లిసి న‌టిస్తున్న ఈ మూవీకి అనిల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. `అప్నే 2` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్ప‌టికే మొద‌లైంది. ధ‌ర్మేంద్ర కుటుంబంలో మూడు తరాలు ఒకే చిత్రంలో న‌టించ‌డం ఇదే మొదటిసారి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్నాయి.