Begin typing your search above and press return to search.

#స‌ర్ ప్రైజ్ కాంబో.. ప్ర‌భాస్ విల‌న్ గా బెబో

By:  Tupaki Desk   |   16 Oct 2021 2:26 PM GMT
#స‌ర్ ప్రైజ్ కాంబో.. ప్ర‌భాస్ విల‌న్ గా బెబో
X
డార్లింగ్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆదిపురుష్ 3డి- స‌లార్ చిత్రీక‌ర‌ణ‌ల‌తో అత‌డు బిజీగా ఉన్నాడు. త‌దుపరి నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్ష‌న్ మూవీ ప్రారంభం కానుంది. ఈలోగానే ఇత‌ర సినిమా క‌థ‌ల్ని ద‌ర్శ‌కుల‌ను కూడా ప్ర‌భాస్ లాక్ చేశారు.

ఆదిపురుష్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. అతను ఇప్పటికే తన పాత్ర‌కు సంబంధించిన‌ షూటింగ్ పూర్తి చేసాడు. ఈ సినిమా సెట్లో క‌రీనా సంద‌డి చేసార‌ని క‌థ‌నాలొచ్చాయి. అనంత‌రం ఆదిపురుషుడి షూట్ సమయంలో కరీనా కపూర్ - ప్రభాస్ మధ్య స్నేహం ఆస‌క్తిక‌రంగా మారింది. కరీనా కపూర్ కు డార్లింగ్ బిర్యానీ పంపారు. బెబో తన ఇన్ స్టాగ్రామ్ లో బిరియానీకి సంబంధించిన ఓ ఫోటోని కూడా పోస్ట్ చేసింది. ప్రభాస్ త‌దుప‌రి బ‌హుభాష‌ల్లో విడుద‌ల‌య్యే పాన్-ఇండియన్ ప్రాజెక్టుల్లో క‌రీనా పని చేస్తున్నారని క‌థ‌నాలొచ్చాయి. ఇటీవల అర్జున్ రెడ్డి ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. స్పిరిట్ అనే టైటిల్ ని ఇప్ప‌టికే లాక్ చేసార‌ని స‌మాచారం. `స్పిరిట్` లో ప్రభాస్ తో పాటు కరీనా కపూర్ స్క్రీన్ స్పేస్ ను పంచుకుంటారని క‌థ‌నాలొచ్చాయి.

తాజా స‌మాచారం మేర‌కు.. ఇందులో కరీనా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌ల క‌నిపిస్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంటే ఇందులో వేరొక క‌థానాయిక న‌టించేందుకు స్కోప్ ఉంద‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ప్రస్తుతం అమీర్ `లాల్ సింగ్ చద్దా`తో బిజీగా ఉన్న కరీన్ కపూర్ త‌దుప‌రి కొత్త సినిమాలకు సంత‌కం చేయాలనుకుంటున్నట్లు సమాచారం. సందీప్ రెడ్డి వంగా స్క్రిప్ట్ తో నటిని సంప్రదించ‌గా బెబో వెంట‌నే ఓకే చెప్పారు. క‌రీనా ఈ చిత్రంలో న‌టిస్తున్న విష‌యాన్ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. సందీప్ వంగాతో స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ దాదాపు 150 కోట్ల పారితోషికం వసూలు చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి