Begin typing your search above and press return to search.

ఆమె ఎంట్రీకై ఎదురుచూస్తున్న బాలీవుడ్..!

By:  Tupaki Desk   |   2 Nov 2022 12:30 AM GMT
ఆమె ఎంట్రీకై ఎదురుచూస్తున్న బాలీవుడ్..!
X
బాలీవుడ్ లో మరో స్టార్ తనయ తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. బాలీవుడ్ క్రేజీ జోడీ అజయ్ దేవగన్, కాజోల్ ల గారాల పట్టి నైసా దేవగన్ తెరంగేట్రానికి రెడీ అంటుంది. అమెరికాలో స్టడీ పూర్తి చేసిన ఈ అమ్మడు వెండితెరకు పరిచయమయ్యేందుకు ఆసక్తిగా ఉంది. ఇప్పటికే బాలీవుడ్ ఈవెంట్స్ ఎక్కడ జరిగినా సరే తన ప్రెజెన్స్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న నైసా సినిమాల్లోకి రాకముందే తన గ్లామర్ తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే సినీ కల్చర్ అలవర్చుకుంటున్న అమ్మడు త్వరలోనే తన తొలి సినిమా ఎనౌన్స్ చేయబోతుందని తెలుస్తుంది.

ఇప్పటికే కాజోల్ కూతురు కోసం కథలను వింటుందట. హీరో అయినా, హీరోయిన్స్ అయినా కెరియర్ లో తొలి సినిమా చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అదికూడా బ్యాక్ గ్రౌండ్ ఉండి.. స్టార్స్ ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోయిన్స్ మీద ఇంకాస్త ఎక్కువ ఫోకస్ ఉంటుంది.

అందుకే నైసా కోసం కథ వేట కొనసాగిస్తున్నారట. ఓ పక్క అజయ్ దేవగన్ హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. కాజోల్ మాత్రం కూతురు కోసం అద్భుతమైన కథ కావాలని అంటుందట. ఇప్పటికే కాజోల్ నైసా కోసం పదుల సంఖ్యల్లో కథలు విన్నట్టు తెలుస్తుంది. వాటిలో ది బెస్ట్ అనిపించుకున్న కథలను సెలెక్ట్ చేసే పనిలో ఉందట. తనయురాలి సినిమా కోసం కాజోల్ తాపత్రయం చూసి అందరు షాక్ అవుతున్నారట..

బాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ తనయులు చాలామంది ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు. ఇప్పుడు నైసా కూడా అదే దారిలో తన సత్తా చాటాలని చూస్తుంది. జాన్వి, అనన్యా పాండే, సారా అలి ఖాన్ తరహాలో నైసా కూడా బాలీవుడ్ సినిమాల్లో రాణించాలని చూస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ ఈవెంట్స్ లో తన గ్లామర్ అప్పీల్ తో వార్తల్లో నిలుస్తున్న నైసా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాక మరింత రెచ్చిపోతుందని చెప్పొచ్చు.

స్టార్ తనయగా తన మీద ప్రెజర్ ఉన్నా సరే తన టాలెంట్ తో అందరిని మెప్పించేందుకు రెడీ అంటుంది నైసా. రీసెంట్ గా దివాళి బాష్ లో కూడా నైసా తన లుక్స్ తో ముంబై మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వకముందే ఈ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న నైసా ఎంట్రీ ఇచ్చాక మరింత ఫాలోయింగ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.