Begin typing your search above and press return to search.

మన సినిమాలు.. అక్కడి తారలు

By:  Tupaki Desk   |   8 Jun 2016 9:45 AM IST
మన సినిమాలు.. అక్కడి తారలు
X
తెలుగు సినిమాలలో తెలుగు హీరోయిన్లకు స్థానం లేదని ఒకవైపు ఆవేదన ప్రకటిస్తున్నా ముంబాయి నుండి భామలను దిగుమతి చేసుకోవడం తగ్గలేదు. అయితే తెలుగు సినిమా రంగానికే డైరెక్ట్ గా దిగి ఇక్కడ విజయాలు సాధిస్తున్న ముంబై భామలకు సైతం ఇప్పుడు గడ్డుకాలం ఎదురుకానుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎందుకంటే ఇప్పటిదాకా తెలుగు ఫిలిం మార్కెట్ పై పెద్దగా కన్నేయని బాలీవుడ్ అగ్రతారలు ఇటువైపు అడుగులు వేస్తున్నారు. బాలీవుడ్ నుండి ఇక్కడ అడపాదడపా మెరిసిన తారల రికార్డుకుడా బానే వుంది. గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక పెట్టించిన మలైకా అరోరా - కరెంటు తీగలో అలరించిన సన్నీ లియోన్ అక్కడివాళ్ళే.

వీటికి ప్రస్తుతం మహేష్ సినిమాలో పరిణీతి చోప్రాని ఎంపిక చేసుకోవడంతో ఈ హంగామా మరింత పెరిగిందనే చెప్పాలి. ఇప్పుడు మెగాస్టార్ 150వ సినిమాకు దీపికా పదుకునే హీరోయిన్ అనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఇవన్నీ నిజమై సక్సెస్ అయితే మన అగ్ర తారలకు మింగుడుపడని విషయాలే..