Begin typing your search above and press return to search.

కాంట్రవర్సీ క్రికెటర్ తో బాలీవుడ్ బ్యూటీ?

By:  Tupaki Desk   |   24 Nov 2016 3:30 AM GMT
కాంట్రవర్సీ క్రికెటర్ తో బాలీవుడ్ బ్యూటీ?
X
ఆమె ఓ బాలీవుడ్ హీరోయిన్. అరంగేట్రంలోనే సెన్సేషన్ సృష్టించి.. వరుసగా బ్లాక్ బస్టర్స్ కొట్టేసింది. ఆ రేంజ్ కాపాడుకోలేకపోయిన ఈ భామ.. తెలుగులో ఎంట్రీలోనే ఓ టాప్ హీరోతో కలిసి హిట్ కొట్టేసింది. ఆ తర్వాత వరుస ఛాన్సులు వచ్చాయి కానీ.. అన్నీ దారుణమైన ఫ్లాపులే.

40ప్లస్ అయినా ఇప్పటికీ పెళ్లి చేసుకోని ఈ బ్యూటీకి.. ప్రస్తుతం బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ అవకాశాలేమీ లేవు. కానీ రీసెంట్ గా ఒక లోబడ్జెట్ తెలుగు సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు అంగీకరించి సెన్సేషన్ సృష్టించింది. ఈ పాట షూటింగ్ కోసం హైద్రాబాద్ వచ్చిన ఈమె.. ఇక్కడ ఓ మాజీ క్రికెటర్ తో కలిసి చక్కర్లు కొట్టేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. షాట్ గ్యాప్ లో సరసాలే కాదు.. నైట్ టైం ఒకే హోటల్ రూమ్ లో ఉంటున్నారట. ఈయన టీం ఇండియా క్రికెట్ జట్టుకు గతంలో కెప్టెన్ గానే వ్యవహించడమే కాకుండా.. కాంట్రవర్సీలను కూడా మూట కట్టుకున్నాడు.

ముందే చెప్పినట్లుగా.. ఆ హీరోయిన్ ఇంకా పెళ్లి కానీ బ్యూటీ అయితే.. ఈ మాజీ క్రికెటర్ మాత్రం రెండో భార్యకు విడాకులిచ్చి సింగిల్ గానే ఉంటున్నాడు. వీళ్లిద్దరి పరిచయం ఏనాటి నుంచి ఉందో ఎవరికీ తెలీదు కానీ.. ఇప్పుడు నడుస్తున్న వ్యవహారం చూసి.. ఇది పాత ఖాతానే అని చెవులు కొరికేసుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/