Begin typing your search above and press return to search.

హీరోయిన్ కు బెదిరింపులు.. చంపేస్తామని హెచ్చరిక!

By:  Tupaki Desk   |   21 Jan 2021 8:19 PM IST
హీరోయిన్ కు బెదిరింపులు.. చంపేస్తామని హెచ్చరిక!
X
తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా వ‌చ్చిన 'లోఫర్' సినిమాలో హీరోయిన్‌గా నటించింది దిశా పఠానీ. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీగా ఉందీ బ్యూటీ. ఇటీవల ఈ అమ్మడు నటించిన 'భాగీ 2', 'భాగీ 3' చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటాయి. ఇక ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో 'రాధే' సినిమాలోనూ నటిస్తోంది దిశా పఠానీ.

అయితే.. ఇప్పుడు ఈ బ్యూటీ డేంజర్ లో ఉందనే వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గుర్తు తెలియని దుండగులు ఫోన్ చేసి.. దిశాను చంపేస్తామని హెచ్చరిస్తున్నారట. అయితే.. కేవలం దిశాకు మాత్రమే కాకుండా, పోలీసులకు కూడా ఫోన్ చేసి, ఆమెను చంపేస్తామని.. ఎవరూ కాపాడలేరని అంటున్నారట!

దీంతో పోలీసులు అప్ర‌త్త‌మ‌య్యారు. ఆ ఫోన్‌ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయా? అని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. అయితే.. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఆ బెదిరింపు ఫోన్ కాల్స్ అన్నీ కూడా పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు గుర్తించారట. ఈ కాల్స్ వెనుక ఉన్న‌ సూత్రధారులు ఎవరనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారట. అయితే.. ఏ కార‌ణంతో అలా బెదిరిస్తున్నార‌నేది మాత్రం తెలియ‌లేదు.