Begin typing your search above and press return to search.

బొకే తో హీరోయిన్ ఇంటికి వెళ్లిన హీరో

By:  Tupaki Desk   |   24 Oct 2021 3:50 AM GMT
బొకే తో హీరోయిన్ ఇంటికి వెళ్లిన హీరో
X
బాలీవుడ్‌ లో కొత్త ప్రేమ పురుడు పోసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. హాట్ బ్యూటీ అనన్య పాండే మరియు యంగ్‌ హీరో ఇషాన్ ఖట్టర్ లు ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిద్దరు కలిసి కాలీ పీలి అనే సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ సమయంలోనే ఇద్దరి మద్య స్నేహం కాస్త మరో స్టెప్‌ పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అప్పటి నుండి కూడా వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్‌ మీడియా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. వీరిద్దరి యొక్క పార్టీలు.. మీటింగ్ ల గురించి ఎప్పటికప్పుడు అక్కడి మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో ఆసక్తికర విషయం ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అనన్య పాండే ఈ మద్య కాలంలో డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న విషయం తెల్సిందే. ఆమె అరెస్ట్‌ అవుతుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. బాలీవుడ్‌ మీడియాలో ఆమె గురించి రకరకాలుగా వార్త కథకాలు వచ్చాయి. దాంతో ఆమె అభిమానులు ఏం జరుగుతుందా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెను పలువురు సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఈ సందర్బంగా పరామర్శించడం జరిగింది. ఆమెను ఈసమయంలో పరామర్శించేందుకు ఇషాన్ ఖట్టర్ కూడా వెళ్లాడు. అతడు అనన్య పాండే ఇంటికి వెళ్లడానికి ముందు స్వయంగా కారు దిగి రోడ్డు పక్కన ఉన్న ఒక పూల బొకే షాప్‌ వద్ద ఆమె కోసం పూల బొకేను కొనుగోలు చేయడం జరిగింది.

ఇషాన్ ఖట్టర్ పూల బొకేను కొనుగోలు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బొకేతో అతడు అనన్య పాండే ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించడం జరిగింది. డ్రగ్స్ కేసులో ఎన్‌ సీ బీ అధికారులు రెండు రోజులు ప్రశ్నించారు. ఆర్యన్ ఖాన్‌ కు డ్రగ్స్ సరఫరా చేసిన విషయంలో ఆమె ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఎన్ సీ బీ విచారణ లో తాను ఎప్పుడు కూడా ఆర్యన్ కు డ్రగ్స్ ఇవ్వలేదు.. అలాగే నేను కూడా ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదు అంటూ తేల్చి చెప్పిందట. కాని ఎన్‌ సీ బీ అధికారులు మాత్రం ఆమె సమాధానంతో సంతృప్తిగా లేరని.. ఆమె పై ఆరోపణలకు సాక్ష్యాలు కూడా ఎన్‌ సీ బీ వారి వద్ద ఉన్నట్లుగా బాలీవుడ్‌ మీడియా వర్గాల టాక్‌. ఆమెను అరెస్ట్‌ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ అమ్మడు విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ లైగర్‌ లో నటిస్తున్న విషయం తెల్సిందే. హిందీలో రెండు మూడు సినిమాలను ఈ అమ్మడు చేస్తోంది.