Begin typing your search above and press return to search.

'మెక్‌డొనాల్డ్స్' కు బ్రాండ్ అంబాసిడర్ యువ హీరో..!

By:  Tupaki Desk   |   16 Dec 2022 1:30 AM GMT
మెక్‌డొనాల్డ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ యువ హీరో..!
X
నటీనటులకు సినిమాలతో ఎంత ఆదాయం వస్తుందో దానికి రెట్టింపు ఆదాయం ప్రకటనలు (యాడ్స్) వల్ల వస్తుందనేది అందరికీ తెలిసిందే. అందుకే హీరో హీరోయిన్లు స్టార్డమ్ కోసం పాకులాడుతుంటారు. ఎంత స్టార్డమ్ ఉంటే అంతా డిమాండ్. స్టార్ హీరోలతో తమ వస్తువులను ప్రమోట్ చేసుకునేందుకు కంపెనీలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి.

ఈ నేపథ్యంలో ఎంతో మంది హీరో హీరోయిన్లు ఎన్నో బ్రాండ్లతో టై ఆప్ అయ్యారు. బాలీవుడ్.. టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను చెందిన నటీనటులంతా ఏదో ఒక బ్రాండ్ ను ప్రమోషన్ చేస్తూ రెండు చేతుల డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక హీరోయిన్లు అయితే బ్రాండ్ల ప్రమోషన్స్ తోపాటు షాషింగ్ ఓపెన్సింగ్స్ పేరిట విరివిరిగా సంపాదిస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తనకు చిన్నతనం ఎంతో ఇష్టమైన మెక్ డోనాల్డ్ రెస్టారెంట్లకు బ్రాండ్ అంబాసిడర్ ఉండేదుకు అంగీకరించినట్లు వెల్లడించారు. మెక్ డెనాల్డ్ ఇండియా వైడ్ గా బ్రాండ్ అంబాసిడర్ గా తనను ఎంచుకున్నందుకు ఆ కంపెనీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మెక్ డెనాల్డ్ తో తనకు ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.

తన చిన్నతనం మెక్ డెనాల్డ్ రెస్టారెంట్లను చూస్తున్నానని తెలిపారు. ఈ రెస్టారెంట్లకు తరుచూ ఫ్యామిలీతో కలిసి వెళ్లేవాడనని తెలిపారు. ఈ రెస్టారెంట్లో తనకు ఎన్నో ఇష్టమైన వంటకాలను తినేవాడననని గుర్తు చేసుకున్నారు. ఈక్రమంలోనే తాను మెక్ డెనాల్డ్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం కావడం గర్వంగా ఉందని తెలిపాడు.

కార్తీక్ ఆర్యన్ ఈ ఏడాది 'భూల్ భూలయ్యా-2'లో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. అయితే ఆ తర్వాత వచ్చిన 'ఫెడ్డీ' మాత్రం మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీలో అతడిని నటనకు మాత్రం విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కాగా కార్తీక్ ఆర్యన్ నటించిన తాజా చిత్రం 'సత్య ప్రేమ్ కి కథ' 2023 జనవరి 29న థియేటర్లలోకి రానుంది.

ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వానీ నటిస్తోంది. ఈ మ్యూజికల్ లవ్ స్టోరీకి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో కార్తీక్ ఆర్యన్ మరో హిట్టు అందుకుంటాడో లేదో వేచిచూడాల్సిందే..!




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.