Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో లేటెస్ట్ లవ్ స్టోరీ

By:  Tupaki Desk   |   10 March 2018 4:30 AM GMT
బాలీవుడ్ లో లేటెస్ట్ లవ్ స్టోరీ
X
బాలీవుడ్ లో కొన్ని వివాహ బంధాలు బలంగా కనిపిస్తాయి. కానీ తెరవెనుక చూస్తే ఆ బంధాలకు బీటలు చాలానే ఉంటాయి. కొన్ని బంధాలు ఆ బీటలను తట్టుకుని నిలబడితే.. ఇంకొన్ని బంధాలు విడాకుల కోసమంటూ కోర్టుకు చేరుతాయి. బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో బంధం ఇలాగే బీటలు వారిందనేది లేటెస్ట్ న్యూస్.

ఆయన బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో. ఏజ్ పెరిగినా క్రేజ్ తగ్గని హీరో. చరిత్రలో హిట్లు ఎక్కువ. ఫ్లాపులు చాలా తక్కువ. తాజాగా తాను నటిస్తున్న సినిమాలో హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడు. అతడికి ఇప్పటికే రెండు సార్లు పెళ్లయింది. అయినా ఇప్పటి తాజా ప్రేయసి చుట్టూనే తిరుగుతూ ఆమె ఫ్లాట్ లో దాదాపుగా మకాం పెట్టేశాడు. సినిమా షూటింగ్ లేనప్పుడల్లా వాళ్లిద్దరూ ఒకే ఇంటిలో కలిసే ఉంటున్నారని బాలీవుడ్ మీడియా అంటోంది. వీళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా బాగానే ఉంది. ప్రస్తుతం భార్యను పట్టించుకోవడం మానేసి పగలూ రాత్రి ప్రియురాలితోనే సమయం మొత్తం గడుపుతున్నాడు.

ఇంతా చేసి వీళ్లు కలిసి నటించింది ఒక సినిమానే అయినా వాళ్ల మధ్య గాఢమైన ప్రేమ ఏర్పడిపోయిందట. మొదటి సినిమాతో వీళ్లిద్దరి మధ్య ఇంత రిలేషన్ లేదు. రెండో సినిమా మొదలుపెట్టిన తరవాత షూటింగ్ కోసం వాళ్లిద్దరూ బోలెడు టైం కలిసి గడపాల్సి రావడంతో ఇంటిమసీ పెరిగిందనేది బాలీవుడ్ టాక్. ఈ వ్యవహారం తెలిసి ఆమె తల్లిదండ్రులు కూడా దూరంగా వెళ్లిపోయారు.