Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ‌మొద‌టి స్వ‌లింగ సంప‌ర్క జంట‌ విడిపోతున్నామ‌ని ప్ర‌క‌ట‌న‌!

By:  Tupaki Desk   |   4 April 2021 11:19 AM IST
బాలీవుడ్ ‌మొద‌టి స్వ‌లింగ సంప‌ర్క జంట‌ విడిపోతున్నామ‌ని ప్ర‌క‌ట‌న‌!
X
బాలీవుడ్ లో మొద‌టి స్వ‌లింగ సంప‌ర్క జంట‌గా ఫేమ‌స్ అయ్యారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ సిద్ధాంత్ పిల్లై, ద‌ర్శ‌కుడు అపూర్వ అస్రానీ. వీరిద్ద‌రూ గ‌డిచిన 14 సంవ‌త్స‌రాలుగా క‌లిసే ఉంటున్నారు. అయితే.. గ‌తేడాది గోవాలో వీరిద్దరూ సొంత‌ ఇల్లు కూడా కొనుగోలు చేశారు. తాము స్వ‌లింగ సంప‌ర్కుల‌ను ప్ర‌క‌టిస్తున్నామ‌ని, ఎల్‌జీబీటీక్యూ జంట‌ల‌కు ధైర్యం చెప్ప‌డానికే ఈ ప్ర‌క‌ట‌న చేస్తున్నామ‌ని ఆ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు.

కానీ.. ఇప్పుడు తామిద్ద‌రం విడిపోతున్నామ‌ని అపూర్వ అస్రానీ తాజాగా ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించారు. త‌మ ‌నిర్ణ‌యం స్వ‌లింగ సంప‌ర్కుల‌ను బాధిస్తుంద‌ని తెలిసిన‌ప్ప‌టికీ.. విడిపోవ‌డం త‌ప్ప‌ట్లేద‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఓ పెద్ద నోట్ కూడా షేర్ చేశారు. అందులో ఏముందంటే..

''నేను, సిద్ధాంత్ విడిపోతున్నట్టు ప్రకటించడానికి చాలా బాధపడుతున్నాను. దేశంలో చాలా మంది ఎల్జీబీటీక్యూ క‌పుల్స్ కు మేం ఆద‌ర్శంగా నిలిచాం. ఈ విష‌యం వారంద‌రినీ నిరాశ‌ప‌రుస్తుంద‌ని నాకు తెలుసు. కానీ.. ఈ 14 సంవ‌త్స‌రాల కాలంలో ప్ర‌తీ రోజు ఎంతో ముఖ్య‌మైన‌ది.. విలువైన‌ది. ఇన్నేళ్ల త‌ర్వాత మేం స్నేహ‌పూర్వ‌కంగానే విడిపోతున్నాం.

మన దేశంలో స్వలింగ సంపర్క జంటకు ఎలాంటి ప్రేర‌ణ‌లు, ఆద‌ర్శాలూ ఉండ‌వు. అయితే.. స్వ‌లింగ సంప‌ర్కుల‌మైన‌ప్ప‌టికీ మా ప్రేమ గురించి ధైర్యంగా ప్ర‌క‌టించాం. క‌లిసి ఉండాల‌నే సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం కూడా తీసుకున్న తొలిత‌రం ఎల్‌జీబీటీక్యూ జంట మేమే. కానీ జీవితంలో ఎన్నో మార్పులు వ‌స్తుంటాయి. మా ప్ర‌యాణంలోనూ వ‌చ్చాయి. విడిపోక త‌ప్ప‌లేదు.

మీ అంద‌రినీ కోరేది ఒక్క‌టే. ఇలాంటి క్లిష్ల ప‌రిస్థితుల్లో మాగోప్య‌త‌ని, మ‌నోభావాల‌ని గౌర‌వించాల‌ని కోరుకుంటు‌న్నాను. ఎలాంటి ఊహాగానాలూ ప్ర‌చారం చేయ‌కండి. భ‌విష్య‌త్ పై న‌మ్మ‌కం వ‌దులుకోకండి'' అంటూ ముగించారు అస్రానీ.