Begin typing your search above and press return to search.

బ‌ర్నింగ్ ఇష్యూ మీద సినిమా కోసం ఆత్రం!

By:  Tupaki Desk   |   8 Aug 2019 1:30 AM GMT
బ‌ర్నింగ్ ఇష్యూ మీద సినిమా కోసం ఆత్రం!
X
సినీ ప‌రిశ్ర‌మ‌ల క‌థ‌ల కొర‌త అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ఈ నేప‌థ్యంలో క‌థల ఎంపిక‌లో ఏదైనా కొత్త ట్రెండ్ మొద‌లైతే.. ఇక అంద‌రూ అదే బాట‌లో న‌డుస్తుంటారు. ప్ర‌స్తుతం బాలీవుడ్లో నిజ జీవిత ఘ‌ట‌న‌లు - ఉదంతాలు - బ‌ర్నింగ్ ఇష్యూల మీద సినిమాలు తీసే ట్రెండ్ న‌డుస్తోంది. పాకిస్థాన్ మీద తొలిసారి మోడీ స‌ర్కారు జ‌రిపిన‌ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ నేప‌థ్యంలో *ఉరి* సినిమా తీస్తే అద్భుత విజ‌యం ద‌క్కింది. ఈ చిన్న సినిమా చాలా పెద్ద హిట్టే అయింది. ఈ వ‌రుస‌లోనే *ఆర్టిక‌ల్ 15* అనే సినిమా చేస్తే దానికి కూడా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవుతున్న *ఆర్టిక‌ల్ 370* మీద సినిమా తీసేందుకు బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌హ‌త‌హ‌లాడిపోతున్నారు.

క‌శ్మీరీల‌కు ప్ర‌త్యేక హ‌క్కులు - అధికారాలు క‌ల్పించే ఈ ఆర్టిక‌ల్‌ ను ర‌ద్దు చేస్తూ ప్రభుత్వం ప్ర‌వేశ పెట్టిన బిల్ రెండు చ‌ట్ట‌స‌భ‌ల్లో పాస్ అయిన సంగ‌తి తెలిసిందే. దీని మీద దేశ విదేశాల్లో పెద్ద చ‌ర్చ న‌డుస్తోంది. ఈ అంశం నేప‌థ్యంలో సినిమా తీసేందుకు నిర్మాత‌లు ఆత్ర‌ప‌డుతున్నారు. ఆర్టికల్ 370 - ఆర్టికల్ 370 ఎత్తివేత - ఆర్టికల్ 370 రద్దు - ఆర్టికల్ 35ఏ - ఆర్టికల్ 370 తొలగింపు - ఆర్టికల్ 35ఏ రద్దు - కశ్మీర్ మే తిరంగా - కశ్మీర్ హామారా హే.. ఇలా హిందీలో లెక్క‌కు మిక్కిలిగా టైటిళ్లు రిజిస్ట‌ర్ అయ్యాయ‌ట‌. హిందీ ఫిలిం ఛాంబ‌ర్లో వ‌రుస‌బెట్టి ఈ టైటిళ్లు రిజిస్ట‌ర్ అవుతుండ‌టంతో ఈ నేప‌థ్యంలో ఎన్ని సినిమాలు వ‌స్తాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. సినిమా తీస్తామో తీయ‌మో.. ఒక టైటిల్ అయితే రిజిస్ట‌ర్ చేసి పెట్టేద్దాం అన్న ఉద్దేశంతో నిర్మాతలు పోటీ ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.