Begin typing your search above and press return to search.

ఒక్క ఆల్బ‌మ్ తో గుండెలు కొల్ల‌గొట్టిన హాటెస్ట్ సింగ‌ర్

By:  Tupaki Desk   |   15 Dec 2021 6:00 AM IST
ఒక్క ఆల్బ‌మ్ తో గుండెలు కొల్ల‌గొట్టిన హాటెస్ట్ సింగ‌ర్
X
సౌత్ - నార్త్ లో చాలామంది అంద‌గ‌త్తెలు అయిన గాయ‌నీమ‌ణులు ఉన్నారు. హాట్ లుక్ తో గుండెలు గుభేల్మ‌నిపించే సింగ‌ర్స్ కి కొద‌వేమీ లేదు. అయితే జాతీయ స్థాయిలో గొప్ప ఎలివేష‌న్ .. ఒక క‌థానాయిక‌కు ఏమాత్రం తీసిపోని ఆహార్యంతో .. పోష్ క‌ల్చ‌ర్ తో మెస్మ‌రైజ్ చేసే సింగ‌ర్లు త‌క్కువ‌.

ఆ కేట‌గిరీకే చెందుతుంది బాలీవుడ్ ఫేమ‌స్ గాయ‌ని ధ్వని భానుశాలి. ఈ బ్యూటిఫుల్ సింగ‌ర్ స్వరకర్తగా తన మొదటి సింగిల్ ను విడుదల చేసింది. మేరా యార్ పాట చార్ట్ బస్టర్ జాబితాలో నిలిచింది. ఈ పాట భారీ సంఖ్యలో వ్యూస్ సంపాదించింది. సాంగ్ ఆద్యంతం ధ్వ‌ని మెరుపులు మెరిపించింది. ఆమె అందానికి అభిమానుల సంఖ్య రెట్టింపు అయ్యింది. పాట‌లో ధ్వ‌ని అంద‌చందాలు మ‌తులు చెడ‌గొడుతున్నాయ‌న‌డానికి ఈ ఫోటోలే నిద‌ర్శ‌నం. 21 ఏళ్ల బ్యూటీ ఈ పాట కోసం నాలుగు విభిన్న రూపాల్లో అల‌రించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోల్ని సోషల్ మీడియా వేదిక‌గా స‌ద‌రు గాయ‌ని షేర్ చేసింది.

ఈ పాట ఆద్యంతం ధ్వ‌ని డిజైన‌ర్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. ధ్వని బ్లాక్ అండ్ వైట్ ప్యాంట్ సూట్ లో అద‌ర‌గొట్టింది. స్కై-హై హీల్స్ మఫిష్ నెట్ స్టాకింగ్స్ తో సెక్సీ లెదర్ డ్రెస్ తో ఆమె మరో లుక్ ఆక‌ట్టుకోగా.. ఆమె ఒక క్లాసిక్ టోపీతో మెరూన్ దుస్తులలో కూడా కనిపించింది. నీటి అడుగున పసుపు రంగు దుస్తులతో మెస్మ‌రైజ్ చేసిన ఫోటో ఈ బంచ్ లో ఉంది. ఆమె యూట్యూబ్ ఛానెల్ లో ఈ పాట ఇప్పటికే కోటి (ప‌ది మిలియన్ల) వ్యూస్ ని అధిగ‌మించింది. ధ్వ‌ని మునుముందు గాయ‌నిగానే కాకుండా న‌టిగానూ రాణించి స‌త్తా చాటుతుందేమో చూడాలి.