Begin typing your search above and press return to search.

తెలంగాణ పిల్ల‌కి బాలీవుడ్ ప్రోత్సాహం!

By:  Tupaki Desk   |   10 May 2022 1:30 PM GMT
తెలంగాణ పిల్ల‌కి బాలీవుడ్ ప్రోత్సాహం!
X
'జోష్' సినిమాతో న‌టిగా ప‌రిచ‌య‌మైన తెలంగాణ గాళ్ శ్రేయాధ‌న్వంత‌రి అతికొద్ది మందికే తెలుసు. తెలుగులో లాంచ్ అయినా హిందీలో బిజీ న‌టిగా మారింది. 'జోష్' చిత్రంలో భావ‌న పాత్ర‌లో న‌టించినా అమ్మ‌డిని గుర్తుప‌ట్ట‌డం క‌ష్ట‌మే. సినిమా ప్లాప్ తో శ్రేయాకి ఏ మాత్రం గుర్తిపంఉ ద‌క్క‌లేదు. ఆ త‌ర్వాత 'స్నేహ‌గీతం' సినిమాలో న‌టించి మ‌రో ఆలోచ‌న లేకుండా బాలీవుడ్ కి వెళ్లిపోయింది.

తొలుత 'ద గ‌ర్ల్ ఇన్ మీ' అనే షార్ట్ ఫిలింలో న‌టించి చిన్న సినిమాల్లో హీరోయిన్ గా ప్ర‌మోట్ అయింది. 'వై చీట్ ఇండియా'.. 'యాంటి సైబ‌ర్ బుల్లాయోంగ్' చిత్రాల్లో న‌టించింది. ఈ రెండు చిత్రాలు చ‌క్క‌ని గుర్తింపు ను తెచ్చిపెట్టాయి. ప్ర‌స్తుతం అక్క‌డ‌ న‌టిగా బిజీగానే కొన‌సాగుతుంది. 'లూప్ లా పేట్'..'అద్భుత్'..'చుప్' చిత్రాల్లో న‌టిస్తోంది.

ఇక 'అద్భుత్' చిత్రానికి సంబంధించి అమ్మ‌డి కెరీర్ లో మెగా ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఈ చిత్రానికి ఫేమ‌స్ మేక‌ర్ స‌బ్బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. న‌వాజుద్దీన్ సిద్దిఖీ.. దైనా పెంటీ.. రోహ‌న్ మెహ్ర‌తాతో పాటు శ్రేయ కీల‌క పాత్ర పోషిస్తుంది. ఇదొక హారర్ థ్రిల్ల‌ర్ .

గ్లామ‌ర్ ఎలివేష‌న్ కి ఎక్కువ స్కోప్ ఉన్న చిత్ర‌మ‌ని తెలుస్తోంది. మ‌రి ఆ ఛాన్స్ ఈ తెలంగాణ పిల్ల‌కి ఉందా? లేదా? అన్న‌ది తెలియాలి.

ఇక సోష‌ల్ మీడియాలోనూ యువ నాయిక‌గా యాక్టివ్ గానే ఉంటుంది. తెలంగాణ పిల్ల అయినా గ్లామ‌ర్ ఎలివేష‌న్స్ లో ఏమాత్రం త‌గ్గ‌దు. బ్యూటీకి ఇన్ స్టాలో మంచి ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా క్ష‌ణాల్లో వైర‌ల్ గా మారుతుంది. తాజాగా అమ‌డు స్లీవ్ లెస్ మ‌ల్టీక‌ల‌ర్డ్ ఔట్ ఫిట్ లో త‌ళుక్కున మెరిసింది. ఎద అందాల ఎలివేష‌న్స్ యువ‌త‌ని ఆక‌ర్షిస్తుంది.

స‌ముద్రంలో బోట్ యాత్ర చేస్తూ ఇలా కెమెరాకి చిక్కింది. ఈ ఫోటో యువ‌త‌లో హాట్ టాపిక్ గా మారింది. నెట్టింట జోరుగా వైర‌ల్ అవుతోంది. తెలుగు అమ్మాయి అయినా బాలీవుడ్ లో ఇంకా ఫేమ‌స్ కాక‌పోవ‌డంతో పెద్ద‌గా ఎవ‌రికి తెలియ‌డం లేదు. తాజా సినిమాతో స‌క్సెస్ అందుకుని పేరొస్తే ఫేమ‌స్ అవుతుంది. అప్పుడే మ‌ళ్లీ టాలీవుడ్ పిలిచి అవ‌కాశాలు ఇచ్చే అవ‌కాశం ఉంటుంది.