Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేస్: ప్రముఖ హీరో సోదరిని రోజంతా విచారించిన ఎన్సీబీ..!

By:  Tupaki Desk   |   12 Jan 2021 11:04 AM IST
డ్రగ్స్ కేస్: ప్రముఖ హీరో సోదరిని రోజంతా విచారించిన ఎన్సీబీ..!
X
బాలీవుడ్ లో వెలుగు చూసిన డ్రగ్స్ మాఫియా కేసులో ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ తో పాటు ఆయన ప్రియురాలు గాబ్రియెల్లా దెమిత్రియాడెన్‌ ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అలానే గెబ్రియోల్లా సోదరుడు అగిసిలాస్ డ్రగ్స్ సరఫరా చేసేవారితో సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఎన్సీబీ అరెస్టు చేసింది. ఇటీవలే అతను బెయిల్‌ పై విడుదల అయ్యాడు. ఈ క్రమంలో అర్జున్ రాంపాల్ సోదరి కోమల్ రాంపాల్ కి సమన్లు జారీ చెయ్యడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. ఎన్సీబీ అధికారులు జనవరి 6వ తేదీన విచారణకు హాజరుకావాలని కోమల్ కు నోటీసులు జారీ చేశారు. అయితే తన ఆరోగ్యం సరిలేదని.. విచారణకు హాజరుకావడానికి సమయం కావాలని ఆమె తరపు న్యాయవాదులు ఎన్సీబీని అభ్యర్ధించారు.

ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని కోమల్ రామ్ పాల్ కు ఎన్సీబీ అధికారులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో సోమవారం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో కోమల్ విచారణకు హాజరైయ్యింది. సాయంత్రం వరకు కోమల్ రాంపాల్ ను ఎన్సీబీ అధికారులు విచారణ చేసి ఆమె చెప్పిన స్టేట్మెంట్ ను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎన్సీబీ వర్గాలు దృవీకరించారని నేషనల్ మీడియా తెలిపింది. కాగా, బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బయటకు వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో ఎన్సీబీ పలువురు సెలబ్రిటీలను విచారించడంతో పాటు కొందరిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు అర్జున్ రాంపాల్ సంబంధీకులను విచారిస్తూ వస్తోంది.