Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసు: బాలీవుడ్ నటుడికి మరోసారి సమన్లు..!
By: Tupaki Desk | 13 Nov 2020 9:15 AM ISTబాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ మరియు ఆయన ప్రియురాలు గాబ్రియెల్లా దెమిత్రియాడెన్ ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అర్జున్ రాంపాల్ కి మరోసారి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 13న ఎన్సీబీ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఇంతకుముందు నవంబర్ 9న అర్జున్ రాంపాల్ నివాసంలో రైడ్స్ చేసిన ఎన్సీబీ అధికారులు కొన్ని రకాల మెడిసిన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని డాకుమెంట్స్ - మొబైల్ ఫోన్స్ - లాప్ టాప్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా విచారణకు రావాలంటూ రాంపాల్ తోపాటు ఆయన ప్రేయసి గాబ్రియెల్లాకు సమన్లు జారీ చేశారు.
కాగా, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను అరెస్ట్ చేయడంతో పాటు అనేకమందిని విచారించారు. ముందుగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకోగా, రియా బెయిల్ పై విడుదలైంది. ఈ క్రమంలో డ్రగ్స్ రాకెట్ తో లింకులు ఉన్నాయని గుర్తించి ఇప్పటికే గాబ్రియెల్లా డెమెట్రియేడ్ సోదరుడుని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు అర్జున్ రామ్ పాల్ కి మరోసారి సమన్లు జారీ చేయడం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.