Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసు: బాలీవుడ్ హీరో ఇంట్లో ఎన్సీబీ సోదాలు..!
By: Tupaki Desk | 9 Nov 2020 5:40 PM ISTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడటంతో ఎన్సీబీ రంగంలోకి దిగి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. స్టార్ హీరోయిన్లను సైతం డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారించింది. ఈ క్రమంలో తాజాగా ముంబైలోని బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ రాకెట్ తో ఏమైనా లింకులు ఉన్నాయనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించారు. ఇటీవల అర్జున్ రామ్ పాల్ ప్రియురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్ సోదరుడుని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అర్జున్ రాంపాల్ ఇంట్లో ఎన్సీబీ సోదాలు చేయడం సంచలనంగా మారింది.
కాగా, ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ముందస్తు సమాచారం మేరకు దీపికా పదుకునే మాజీ మేనేజర్ కరిష్మా ప్రకాష్ నివాసంలో దాడులు చేసారు. ముంబైలోని కరిష్మా ఇంట్లో నిర్వహించిన దాడులలో 1.8 గ్రాముల నిషేధిత డ్రగ్స్ లభించడంతో ఆమెకు మరోసారి ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. కాకపోతే ఆమెకు ఇప్పటి వరకు మూడుసార్లు నోటీసులు ఇచ్చినా కరిష్మా ఎన్సీబీ ఎదుట హాజరుకాలేదని తెలుస్తోంది. ఇకపోతే డ్రగ్స్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నాడియాద్వాలా భార్య షబానా సయీద్ ని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. షబానా నివాసంలో సోదాలు నిర్వహించగా 10 గ్రాముల మార్జువానా దొరికినట్లు తెలుస్తోంది. దీంతో ఫిరోజ్ నడియాడ్ వాలా కి కూడా ఎన్సీబీ సమన్లు జారీ చేసింది.