Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసు : ముగ్గురు స్టార్ హీరోలను విచారించనున్నారా...?
By: Tupaki Desk | 30 Sept 2020 11:30 AM ISTబాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు విచారణలో భాగంగా డ్రగ్స్ రాకెట్ పై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురు డ్రగ్ డీలర్లను అరెస్ట్ చేశారు. ఇదే క్రమంలో స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే - శ్రద్ధా కపూర్ - రకుల్ ప్రీత్ సింగ్ - సారా అలీఖాన్ లను ఎన్సీబీ విచారించింది. వీరితో పాటు దీపికా మేనేజర్ కరిష్మా కపూర్ - ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టా - టాలెంట్ మేనేజర్ జయ సాహా - ధర్మ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ లను కూడా ప్రశ్నించింది. ఈ విచారణలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కాగా, డ్రగ్స్ కేసులో త్వరలోనే షాకింగ్ విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో బయటకు వచ్చిన సినీ ప్రముఖుల ఫోన్లపై అధికారులు నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో మరో ముగ్గురు ప్రముఖ హీరోలకు కూడా డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఎన్సీబీ వారికి కూడా నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆ హీరోలు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న హీరోలే అని బీ టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్స్ ఒక్కొక్కరిని విచారిస్తుండటంతో ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతోంది.